ఈటల రాజేందర్ రాకతో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ పార్టీ… మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 30 న బీజేపీ రాష్ట్ర వర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర కార్యవర్గం. ఈ సమావేశంలో హుజురాబాద్ ఉప ఎన్నిక, బండి సంజయ్ జిల్లాల పర్యటనతో పాటు తాజా రాజకీయ అంశాలపై చర్చ జరుగనుంది. జూలై 1 నుంచి 8 వరకు బండి సంజయ్ జిల్లాల పర్యటన చేయనున్నారు.…
అధికారాన్ని కాపాడుకునేందుకు ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. శాంతి భూషణ్ అనే అడ్వాకేట్ లేకపోతే ఇందిరాగాంధీ చేసిన తప్పిదాలు ప్రజలకు తెలిసేవి కావు. అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించి ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేశారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 86లక్షల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసింది. చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించే కృషి చేయాలి. ప్రశ్నిస్తే పత్రికలను అణిచివేస్తూ, జర్నలిస్టులను అరెస్ట్ చేయిస్తుంది…
శక్తి వంతమైన భారతదేశం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు మోడీ. స్వంతంగా మెజారిటీ ఉన్నా అందరినీ కలుపుకుని పోయి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రతి భారతీయుడు తలెత్తుకుని నేను భారతీయుడిని అని చెప్పుకోవాలి. 2014 తర్వాత దేశం అభివృద్ధి చెందుతుంది. ధనిక రాష్ట్రం అయిన తెలంగాణను అప్పుల పాలు చేసారు కేసీఆర్. బీజేపీకి భయపడి గడీల నుంచి ఇప్పుడు బయటకు వస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటివరకు కేసీఆర్…
ఓయూ జేఏసీ విద్యార్థి సురేష్ యాదవ్ ని పరామర్శించిన తర్వాత మీడియా బండి సంజయ్ మాట్లాడుతూ… బలిదానాలకు తెగించి కొట్లాడిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన భూమిక పోషించిన విద్యార్థులపై రాక్షస ముఖ్యమంత్రి డైరెక్షన్ లో టిఆర్ఎస్ పార్టీ గుండాల దాడులు చేస్తున్నరు అని మండిపడ్డారు. కేసీఆర్ పై దాడులు చేసే రోజు వస్తుంది… కేసీఆర్ నీ పతనం స్టార్ట్ అయింది. ప్రశ్నిస్తే దాడులు.. చేస్తారా అని అన్నారు. మంచి చేయాలని చెప్తే…
తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోందని… అరాచకాలను ప్రశ్నించే గొంతుకలను అణిచి వేస్తున్నారని ఫైర్ అయ్యారు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇప్పుడు తెలంగాణ వాదులు, ప్రజా స్వామ్యవాదులకి ఏకైక వేదిక బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు. 18 ఏళ్ళు నిండిన భారత ప్రజలందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలనను వ్యతికించిన ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులను అణిచివేయడమే లక్ష్యంగా పాలన…
సిఎం కెసిఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి నుండి కాపాడేందుకు వాక్సిన్ తయారీలో మోడీ చూపించిన చొరవ అభినందనీయమన్నారు. స్వదేశీ కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేయకుండా ఉంటే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేదని…రాబోయే రోజుల్లో వాక్సినేషన్ లో అగ్రస్థానంలోకి మన దేశం రానుందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు మోడీకి కృతజ్ఞతలు తెలిపారని..తెలంగాణ సీఎం కెసిఆర్ మాత్రం స్పందించలేదని…ఆయనొక సంస్కార హీనుడని మండిపడ్డారు. రూ.…
టీఆర్ఎస్ సర్కార్ పై బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన ప్రారంభమైందని.. ప్రజలు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. టీఆరెస్ పార్టీ ఒక గడిలా పార్టీ అని.. నిజాంను మైమరిపించే విధంగా ఒక రాక్షస నిరంకుశ పాలన కోనసాగిస్తున్నదని ఫైర్ అయ్యారు. ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఈటెలకు ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో ఈ విధంగా జరిగిందంటే మిగతా వాళ్లు కూడా ఆలోచించు కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.…
సిఎం కెసిఆర్ పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్లు నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని.. తెలంగాణ వచ్చాక ..నీళ్లు ఫామ్ హౌజ్ కు, నిధులు సీఎం అనుయాయులకు, నియామకాలు ఆయన ఫ్యామిలకే పోయాయని ఫైర్ అయ్యారు. తొలి దశ, మలి దశ ఉద్యమానికి ఊపిరే యువత అని..ఆ యువత తెలంగాణ ఏర్పడ్డాక 7 ఏళ్లుగా ఉద్యోగం, ఉపాధి లేక అల్లాడుతోందన్నారు. లక్షలాది మంది యువతీ,…
రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే ఇప్పటికే ఢిల్లీకి మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఏనుగు రవీందర్ రెడ్డి వెళ్లారు. ఈటల రాజేందర్ అంశం పైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ చుగ్ తో ఇప్పటికే బండి మాట్లాడారు. ఇక రేపు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను, ఢిల్లీ పెద్దలను ఈటల కలవనున్నారు. ఈటల రాజేందర్…
భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొని తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఇటీవల అన్ని పార్టీల ముఖ్యనేతలతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈటల ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. బీజేపీలో చేరతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం హాట్ టాపిక్గా మారింది. ఈటల రాజేందర్ తో పాటే తెలంగాణ…