ఈటల రాజేందర్ రాకతో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ పార్టీ… మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 30 న బీజేపీ రాష్ట్ర వర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర కార్యవర్గం. ఈ సమావేశంలో హుజురాబాద్ ఉప ఎన్నిక, బండి సంజయ్ జిల్లాల పర్యటనతో పాటు తాజా రాజకీయ అంశాలపై చర్చ జరుగనుంది. జూలై 1 నుంచి 8 వరకు బండి సంజయ్ జిల్లాల పర్యటన చేయనున్నారు. అంతేకాదు… పార్టీ సంస్థాగత నిర్మాణంపై రాష్ట్ర బీజేపీ దృష్టి పెట్టింది.
read also :నేడే ప్రగతిభవన్‌లో అఖిలపక్ష సమావేశం…
119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కన్వీనర్లు, 17 పార్లమెంట్ కన్వీనర్లు, పార్లమెంట్ జాయింట్ కన్వీనర్లు, కౌన్సిల్ మెంబర్లు, లీగల్ సెల్, మెడికల్ సెల్ వంటి అనుబంధ సంఘాలు నియామాకం, 400ల పార్టీ పదవులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి…జూలైలో కొన్ని జిల్లాల్లో పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జులై చివరి వారంలో కానీ, ఆగస్ట్ మొదటి వారంలో కానీ బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించనున్నట్లు సమాచారం అందుతోంది. పాదయాత్ర ముగింపు మాత్రం హుజురాబాద్ లో ఉండే విధంగా ప్లాన్ చేస్తోంది బీజేపీ.