ఓయూ జేఏసీ విద్యార్థి సురేష్ యాదవ్ ని పరామర్శించిన తర్వాత మీడియా బండి సంజయ్ మాట్లాడుతూ… బలిదానాలకు తెగించి కొట్లాడిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన భూమిక పోషించిన విద్యార్థులపై రాక్షస ముఖ్యమంత్రి డైరెక్షన్ లో టిఆర్ఎస్ పార్టీ గుండాల దాడులు చేస్తున్నరు అని మండిపడ్డారు. కేసీఆర్ పై దాడులు చేసే రోజు వస్తుంది… కేసీఆర్ నీ పతనం స్టార్ట్ అయింది. ప్రశ్నిస్తే దాడులు.. చేస్తారా అని అన్నారు. మంచి చేయాలని చెప్తే కూడా దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.
సురేష్ యాదవ్ పై రెండోసారి దాడి జరిగింది. తెలంగాణలో అనుకున్న లక్ష్యాలు నెరవేరడం లేదని ప్రశ్నిస్తే దాడి చేశారు. బరితెగించి రోడ్లపై దాడులు చేస్తుంటే శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తోంది అన్నారు. 20 మంది గుండాలు ప్రజలందరూ చూస్తుంటే డాడీ చేశారు. ముఖ్యమంత్రి ఎందుకు ఖండించలేదు. హాస్పిటల్ కి వెళితే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయరు. సురేష్ వాళ్ళ అమ్మ ,అన్న ను తీసుకు వచ్చి ఉల్టా కేసు పెట్టే ప్రయత్నం కెసిఆర్ ప్రభుత్వం చేస్తోంది. క్రిమినల్స్ ని ప్రభుత్వం పెంచి పోషిస్తోంది అని తెలిపారు. సురేష్ యాదవ్ పై దాడి చేసిన గుండాలను అరెస్టు చేయాలి వారిపై 307 కేసు పెట్టాలి. ముఖ్యమంత్రి విజ్ఞత ఉంటే సురేశ్ కుటుంబ సభ్యుల ను మాటల తో వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు.