రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయి పేట గ్రామంలోని ఇటీవల టీఆరెస్ నాయకుల దాడి ఘటనలో గాయపడ్డ దళిత కూలీ బొడ్డు భూమయ్యను పరామర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బీజేపీ నాయకులు. దళితులపై, సమాన్యులపై దాడులు చేయడానికి టీఆర్ఎస్ లీడర్లకి ప్రభుత్వం లైసెన్స్ లు ఇచ్చింది అన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల దళితులపై దాడులు జరిగిన ముఖ్యమంత్రి మాత్రం స్పందించలేదు. తెలంగాణ రాష్ట్రం లో దళితులపై దాడులు ఆనవాయితీగా మారాయి.. తెలంగాణ ఎస్సీ ఎస్టీల పై దౌర్జన్యాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ దాడిలో చనిపోతే పరిహారం, బతికుంటే పరామర్శలు చేస్తున్నారని విమర్శించారు. భూమయ్యకు న్యాయం జరగకపోతే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు బండి సంజయ్.