రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే ఇప్పటికే ఢిల్లీకి మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఏనుగు రవీందర్ రెడ్డి వెళ్లారు. ఈటల రాజేందర్ అంశం పైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ చుగ్ తో ఇప్పటికే బండి మాట్లాడారు. ఇక రేపు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను, ఢిల్లీ పెద్దలను ఈటల కలవనున్నారు. ఈటల రాజేందర్…
భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొని తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఇటీవల అన్ని పార్టీల ముఖ్యనేతలతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈటల ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. బీజేపీలో చేరతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ఈటల రాజేందర్ తో పాటే తెలంగాణ…
ఈటల రాజేందర్ జాయినింగ్ పై బిజెపి రాష్ట్ర నేతల క్లారిటీ ఇచ్చారు. ఈటల చేరికపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన బండి సంజయ్.. ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఢిల్లీ పెద్దలకు చెప్పారు. ఉద్యమకారులకు కచ్చితంగా బిజెపి ప్రాధాన్యత, తగిన గౌరవం కూడా ఇస్తుందని బండి సంజయ్ కి చెప్పారు ఢిల్లీ పెద్దలు. ఈటల రాజేందర్ చేరికపై రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్న బండి సంజయ్..ఈటలను బిజెపిలో చేర్చుకోవాలని ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్నిచెప్పారు రాష్ట్ర బిజెపి ముఖ్య నేతలు.…
సమ్మె చేస్తున్న డాక్టర్లతో తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరపాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు & పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. డాక్టర్లకు కెసిఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. నోటితో మాట్లాడి …నొసటితో వెక్కిరించి నట్లు సిఎం కెసిఆర్ హామీలు ఉన్నాయని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మీ అధికారుల్లో చిత్త శుద్ధి లేదు.. చెత్త శుద్ధి ఉందని మండిపడ్డారు. డాక్టర్లు చేస్తున్న న్యాయ బద్ద సమ్మెను పరిష్కరించాలని..…
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కాలయముడు లాగా తయారు అయ్యాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఉసురు పోసుకుంటున్నారని..కుంభకర్ణ నిద్ర వీడి రెండు హస్పిటల్స్ ను విజిట్ చేసి.. 7 సంవత్సరాల పబ్లిసిటీ పొందారని ఎద్దేవా చేశారు. ఎద్దు ఎడిసిన వ్యవసాయం…రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అని కెసిఆర్ అన్నారని..మరి ఇప్పుడు తెలంగాణ రైతు ఎడుస్తున్నారు…ఉచిత ఎరువులు ఇస్తానన్న సీఎం ఎందుకు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. రైతుబంధు ఎక్కడికి…
సిఎం కెసిఆర్ పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్, ఫార్మ్ హౌస్ దాటి సీఎం కేసీఆర్ బయటకు రావాలని బీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుందన్నారు. ప్రజల విజ్ఞప్తులను కూడా తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకే టైం ఇవ్వని సీఎం..ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత బయటక వచ్చారని ఎద్దేవా చేశారు. పబ్లిసిటీ కోసమే ఇదంతా చేశారు…సీఎం కేసీఆర్ గాంధీకి వెళ్లడం పట్ల చాలా సంతోషిస్తున్నామన్నారు.…
తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని సిఎం కెసిఆర్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ. అయితే కెసిఆర్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై బిజేపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఆయుష్మాన్ భారత్ లో చేరాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని… రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలన్న డిమాండ్ తో రేపు…
సిఎం కెసిఆర్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకున్నారా ? వ్యాక్సిన్ తీసుకుంటే.. ఫోటో కూడా ఎందుకు విడుదల చేయలేదు ? అని మండిపడ్డారు. కేసీఆర్‌కు కేంద్రాన్ని విమర్శించే అర్హత లేదని.. టాస్క్‌ఫోర్స్ కమిటీ వేసి కలక్షన్స్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. 20 కోట్ల వ్యాక్సిన్లను ఉచితంగా రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసింది… రానున్న 3 రోజుల్లో మూడు లక్షల డోసులు రానున్నాయన్నారు. తెలంగాణకు…
కరోనా విపత్తుతో ప్రజలు చితికిపోతున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకంలో కరోనా చికిత్సను చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ కి వినతిపత్రం సమర్పించారు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. అందులో ”కరోనాను ఎదుర్కోవడంలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమైంది. ఫలితంగా ఈ వ్యాధి విస్తరిస్తోంది. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చకపోవడంతో గ్రామీణులు ముఖ్యంగా పేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో వైద్య వసతులు పెంచడంలో టీఆర్ఎస్…
దేశ ప్రజలంతా కరోనాతో వణికి పోతుంటే తెలంగాణ రైతు ఆ కరోనాతో సహవాసం చేస్తూ కల్లాలు, మార్కెట్లో వారాల తరబడి బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అన్నారు. ప్రభుత్వ రైతు ఆరుగాలం శ్రమించి పండించిన యాసంగి ధాన్యం అంతా వాన పాలు అవుతోందని ఆయన ఆరోపించారు. ప్రతి ఏటా ఇట్లాంటి సమస్యలే వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం మేల్కొనడం లేదని ఆయన మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తుండటంతో రైతులు వారాల…