తెలంగాణలో మళ్ళీ ముందస్తు ఎన్నికలు రానున్నాయా? కేసీఆర్ గతంలోలాగే మళ్లీ ఎన్నికల నగారా మోగించనున్నారా? 2023లో రావాల్సిన ఎన్నికలు 2022లో ఎప్పుడైనా వస్తాయా? అవుననే అనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. సిద్ధంగా ఉండండి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు. రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించారు తెలంగాణ సీఎం కేసీఆర్. గతంలో ఆరునెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ…
తెలంగాణలో రాజకీయాలు వేడిని రాజేస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ మంత్రులు, ఎంపీలు, మరోవైపు తెలంగాణ బీజేపీ నేతల పర్యటనలతో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణలో చలి చంపేస్తుంటే.. నేతలు వరి చుట్టూ రాజకీయాలను నడుపుతున్నారు. త్వరలో తెలంగాణ పర్యటనకు వస్తానన్నారు కేంద్ర హోం మంత్రి, బీజేపీ బాద్ షా అమిత్ షా. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని, కేసీఆర్ ట్రాప్ లో పడకండని హితవు పలికారు హోం మంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా కేసీఆర్‌తో…
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోవడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గౌరవ వేతనాన్ని పెంచాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి కనీస స్పందన లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.కేసీఆర్ నిరంకుశ, నిర్లక్ష్య వైఖరివల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. మా పిల్లలు తినే…
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం జగన్నాథ్పల్లి గేట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 గురు మృతి చెందడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు బండి సంజయ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య…
కేసీఆర్ ప్రస్తుతం డిప్రెషన్ లో ఉన్నాడు. బీజేపీ అంటే కేసీఆర్ భయపడుతున్నాడనీ ఆ పార్టీ ఎమ్మెల్యే లే చెప్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఔరంగజేబుల వ్యవహరిస్తే శివాజీల సమాధానం చెప్తాం. ఊసరవెల్లిల కేసీఆర్ వ్యవరిస్తున్నారు. బీజేపీ నేతలను ఉరికిస్తవ?ఎలా ఉరికిస్తవో చూస్తాం అని చెప్పారు. తమిళనాడులో ఏనుగు మొట్టి కాయలు వేసినా కేసీఆర్ కు సిగ్గు రాలేదు. నీ తుగ్లక్ పాలన వల్ల, నీ ఆనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు…
తెలంగాణలో ఇంటర్ విద్యార్ధులకు ఇంటర్ బోర్డ్ షాకిచ్చింది. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కు పోతోందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దు… నూరేళ్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. ప్రభుత్వ తప్పిదం కారణంగానే ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతున్నాయన్నారు. కరోనా సమయంలో ఆన్‌లైన్ క్లాసులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం. ఫెయిలైన విద్యార్థుల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులే అధికంగా ఉండటమే ఇందుకు నిదర్శనం.…
టీఆర్ ఎస్ పార్టీ పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఫంక్షన్స్ ఉన్నాయనే టీఆర్ ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ,టీఆర్ ఎస్ పార్టీలు ఒక్కటేనని… పార్లమెంట్ లో టీఆర్ ఎస్ కు కాంగ్రెస్ మద్దత్తు ఇచ్చిందని మండిపడ్డారు. గతంలో ఆ రెండు పార్టీ లు పొత్తు పెట్టుకున్నాయని.. సీఎం సంతకాలు చేసేటప్పుడు సోయిలో ఉండి చేయాలన్నారు. కృష్ణా జలాల విషయంలో సంతకం పెట్టాడు……
సీడీఎస్ బిపిన్ రావత్ దుర్మరణం యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు మరో 13 మంది చనిపోవడం యావత్ దేశాన్ని బాధలోకి నెట్టివేసింది. ఏ మట్టి కోసం పరితపించాడో.. అదే మట్టిలో మరణించాడు బిపిన్ రావత్. ఈరోజు తమిళనాడు నుంచి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ పార్థీవ దేహాలు ఢీల్లీకి తరలించనున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అమిత్ షాతో నేడు…
తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటన పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి, ఆర్మీ అధికారులకు సంతాపం వ్యక్తం చేశారు బండి సంజయ్. మాతృభూమి రక్షణ కోసం రావత్ చేసిన సేవలు ఎనలేనివన్నారు బండి సంజయ్. రావత్ మరణం దేశానికి తీరని లోటన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు…
ఢిల్లీ లో టీ ఆర్ ఎస్ ఎంపీ లు కడుపు లో పేగులు తెగే దాకా కొట్లాడారని, కాంగ్రెస్ బీజేపీ ఎంపీ లు కొట్లాడకున్నా టీ ఆర్ ఎస్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు. వాళ్లు మనుషులా పశువులా? బీజేపీ ఎంపీ పశువులా మమ్మల్ని బియ్యం స్మగ్లర్లు అంటున్నాడు. ఇలాగేనా రాజకీయాలు చేసేది. మేం జవాబు దారీ అంటే అదీ తెలంగాణ ప్రజలకే.. ఢిల్లీ కి గుజరాత్ లకు మేము…