బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ ప్రజాస్వామ్య యుతంగా జాగరణ దీక్ష చేపట్టారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇది పతనానికి నాంది అని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే స్థానికత అంశం మీద అని, స్థానికతకు ఈ ప్రభుత్వం చరమ గీతం పాడిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఉద్యమకారులను వదిలి ఉద్యమ ద్రోహులను దగ్గర చేర్చుకున్నాడని, మూడు సంవత్సరాలు నిద్రపోయిన…
బండిసంజయ్ అరెస్టు పై బీజేపీఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ ..కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. డిసెంబర్ 25న కోవిడ్ పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు తరవాత కేసీఆర్ నల్గొండ పర్యటనకు వెళ్లారు… మాస్క్ లేదు.. వేల మంది హాజరయ్యారన్నారు. ఆ తర్వాత ktr నల్గొండ జిల్లాకు వెళ్లారు. నిబంధనలు ఉల్లంఘించారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. కేటీఆర్‌కు మాస్క్ లేదు. నిన్న కరీంనగర్‌లో గంగుల కమలాకర్ ప్రెస్‌మీట్ పెట్టాడు మాస్క్ లేదు. వీరికి…
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు కరీంనగర్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సంజయ్ సహా కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్‌కు ఈనెల 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జాగరణ దీక్ష సందర్భంగా జరిగిన ఉద్రిక్తత ఘటనలపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. రెండో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సంజయ్‌కు కోర్టు రిమాండ్ విధించింది. రేపు మరోసారి బెయిల్ పిటిషన్ వేయనున్నారు బండి…
నిన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉద్యోగుల బదిలీల అంశంపై కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు నిన్న రాత్రి బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం చేసేందుకు రాగా బండి సంజయ్‌ను కార్యకర్తలు కార్యాలయంలోకి పంపి తాళం వేశారు. దీంతో పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో తలుపులు బద్దలు కొట్టి నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు కరీంనగర్ ఎక్సైజ్…
ఈ రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలువుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బండి సంజయ్ జాగరణ దీక్షను అడ్డుకోవడం పై ఆయన సోమవారం మాట్లాడుతూ ..కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ కేసులకు భయపడబోదన్నారు. కేసీఆర్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.. ప్రగతి భవన్‌కు ఇనుపకంచెలు, ఫాంహౌస్‌కి గోడలు కట్టుకుని ఉంటున్నాడని ఆయన ధ్వజమెత్తారు. సీఎం ఒక చక్రవర్తిలా ఎవరి మాట వినను అంటున్నాడని ఆరోపించారు. కోవిడ్ నిబంధనలు ఉన్నాయని సంజయ్ తన…
హైడ్రామాల నడుమ బండి సంజయ్ దీక్ష భగ్నం చేశారు పోలీసులు. బండి సంజయ్ ని అరెస్టు చేసి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అడ్డుకున్న కార్యకర్తలపై నిర్దాక్షిణ్యంగా లాఠీలు ఝుళిపించారు పోలీసులు. తలకు గాయమై రక్తం కారుతున్నా పట్టించుకోకుండా బండి సంజయ్ ను తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించారు పోలీసులు. దీంతో బండి సంజయ్ కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అంతకుముందు ఆఫీస్ తలుపులు పగులగొట్టి లోపలికెళ్లిన పోలీసులు బండి సంజయ్ ని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేశారు.…
కరీం నగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీక్షా శిబిరం దగ్గర పోలీసులు-బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కరీంనగర్ ఎంపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత ఏర్పడింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ బీజేపీ నేతలు, కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారీగా మోహరించారు పోలీసులు. డౌన్ డౌన్ కేసీఆర్ అని మహిళా నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బృందం గవర్నర్ తమిళసైని ఈ రోజు కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, టీచర్ల సమస్యలు, 317 జీవో పునఃసమీక్షపై ఈ సందర్భంగా గవర్నర్‌తో బండి సంజయ్ బృందం చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 317 జీఓ ని సవరించాలన్నారు. ఈ జీఓ లో తమకు అనుకూల మైన వారిని ఇష్టమొచ్చిన చోట కేటాయించుకునే ఆప్షన్ ఉందన్నారు. సీఎం వెంటనే ఉద్యోగుల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఇంకా…
తెలంగాణలో ఉద్యోగుల బదిలీపై గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణ గవర్నర్ తమిళసైని కలిసి ఈ రోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, టీచర్ల సమస్యలు, 317 జీవో పునఃసమీక్షపై గవర్నర్‌తో బండి సంజయ్ బృందం చర్చించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం బిజీ గా ఉన్నారు, ఉద్యోగుల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.. అందుకే గవర్నర్ ని కలిసామని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినప్పుడే…
రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతుల్లో తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్‌లో ఉన్న కేసీఆర్‌కు మీడియా ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలి అనుకుంటున్నాని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధరాత్రి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏక్ నిరంజన్‌లా నిర్ణయాలు తీసుకుంటూ తుగ్లక్‌లా…