సిద్దిపేట జిల్లా మిర్‌దొడ్డిలో ఇవాళ ఉద్రిక్తత నెలకొంది.. తనకు సరైన భద్రత కల్పించడం లేదంటూ పీఎస్ లో దీక్షకు దిగారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. దీంతో.. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెజ్జంకి పీఎస్‌కు తరలించారు. ఈసందర్భంగా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు అడ్డుపడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.. అయితే, రఘునందన్ రావును బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సిద్దిపేట సీపీకి ఫోన్ చేసిన ఆయన.. కొందరు పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Read Also: Pawan Kalyan: విద్యుత్ ఛార్జీలపై ఉద్యమం.. ఉచిత విద్యుత్ హామీ ఏమైంది..?
ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ ప్రజాప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కొంత మంది పోలీసులు టీఆర్ఎస్ కు తొత్తులుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కొందరు పోలీసుల తీరువల్ల పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు బండి సంజయ్… టీఆర్ఎస్ పాలనలో పోలీస్ స్టేషన్ కు వెళ్తే న్యాయం జరగడం లేదనే భావన సామాన్య ప్రజల్లో నెలకొందన్నారు.