Etala Rajender: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రికత్త నెలకొంది. సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తు్న్నారు. సంజయ్ కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలకు బీజేపీ పిలుపునిచ్చింది. అయితే బండిసంజయ్ అరెస్ట్ ను బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఖండించారు. ఒక ఎంపీనీ కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కేసీఆర్ చెప్పినట్టు పోలీసులు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తప్పు దోవపట్టించడానికి నిదర్శనం బండి సంజయ్ అరెస్ట్ అని నిప్పులు చెరిగారు ఈటెల. బండిసంజయ్‌ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ జాతీయ అద్యక్షురాలు డీకే అరుణ..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసుల అక్రమ అరెస్టును బీజేపీ జాతీయ అద్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. బీఅర్ఎస్ పార్టీకు కాలం చెల్లిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు త్వరలో మీ పార్టీనీ బొంద పెడుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడని లేకుండా, అకారణంగా అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలి డీకే అరుణ డిమాండ్ చేశారు.
బండి సంజయ్ గొంతు నోక్కేందు అరెస్టులు చేస్తున్నారని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రబకార్ ఆరోపించారు. లిక్కర్ క్వీన్ , లీకు వీరుడిని కాపాడేందుకు కేసీఆర్ చేస్తున్న యత్నాలను జనం ఉంచడంతో బండి సంజయ్ ను అరెస్ట్ చేరని మండిపడ్డారు. మానవ హక్కుల ఉల్లంఘన , పార్లమెంట్ సభ్యడి హక్కులను కలరాస్తున్నారు ఆరోపించారు. బండి సంజయ్‌ను వెంటనే విడిదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు.
Vontimitta Kodandarama Kalyanam: ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు.. ట్రాఫిక్ ఆంక్షలు