Bandi sanjay arrest: 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ కావడం రాజకీయంగా కూడా కలకలం రేపుతోంది. 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. పోలీసులు మంగళవారం అర్థరాత్రి కరీంనగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి బండిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో బీజేపీ కార్యక్తలను ఎందుకు అదుపులో తీసుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. పోలీసుల సమాధానం చెప్పకుండా..బండి సంజయ్ ని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో బండి సంజయ్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తతంగా మారాయి. బండి సంజయ్ ను తీసుకువెళుతుండగా బీజేపీ కార్యక్తరలు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు భారీగా మోహరించి పోలీసులు బండి సంజయ్‌ను అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. కరీంనగర్ దాటిన తర్వాత ఎల్.ఎండీ వద్ద వాహనం మొరాయించడంతో బండి సంజయ్ ని మరో వాహనంలో బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు సంజయ్ ను తరలించారు పోలీసులు.
హన్మకొండ జిల్లా కమలాపూర్‌లోని పరీక్షా కేంద్రం నుంచి మంగళవారం 10వ తరగతి హిందీ పేపర్‌ను బయటకు తీసుకొచ్చిన కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ కార్యకర్త బురం ప్రశాంత్ ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా బండి సంజయ్ కి పంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సోమవారం కూడా బండి సంజయ్ ప్రశాంత్‌తో మాట్లాడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు బండిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ముందుగానే అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో బండి సంజయ్ మంగళవారం అర్ధరాత్రి సిద్దిపేటలో ఆగకుండా కరీంనగర్ వైపు వెళ్లాడు. అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తూ సిద్దిపేటలోని రంగధాంపల్లి అమర వీరుల స్థూపం వద్ద మీడియాతో మాట్లాడతారని తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, స్థానికులు అక్కడకు చేరుకున్నారు. కానీ అక్కడ బండిసంజయ్ దిగకుండా వెళ్లిపోయారు. బండి సంజయ్ అత్తమ్మ (సతీమణి అపర్ణ మాత్రుమూర్తి) చనిపోయి 9వ రోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్ వచ్చిన బండి సంజయ్ తెలిపారు. పేపర్ లీకేజీ విషయంలో బీఆర్ఎస్ బండారాన్ని బయటపెట్టేందుకు ఇవాళ బండి సంజయ్ ఉదయం 9 గంటలకు ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్దమైనట్టు సమాచారం అందుకున్న పోలీసులు అర్ధరాత్రి బండి సంజయ్ ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ చేసేశారు. మంగళవారం నాడు టెన్త్ లీకైన కొశ్చన్ పేపర్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వద్దకు కూడా చేరిందని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఉదయం 9.45 గంటలకు ఈ కొశ్చన్ పేపర్‌ను ఫోటో తీసినట్లు వివరించాడు. 11.24 గంటలకు బండి సంజయ్ ఫోన్‌కు పేపర్ వచ్చిందని తెలిపారు.
Kiccha Sudeep: బీజేపీలో చేరనున్న స్టార్ హీరోలు.. కాషాయ పార్టీలోకి కిచ్చా సుదీప్, దర్శన్