Balineni Srinivasa Reddy: ప్రజలు మాతోనే వున్నారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అంటున్నారు.. సీఎం జగన్‌కే మా సపోర్ట్ అంటున్నారు.. అందుకే తెలుగుదేశం పార్టీకి నేతలకు నిద్రపట్టడం లేదని విమర్శించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ప్రచార రథంపై జరిగిన దాడిన ఖండించిన ఆయనే.. మార్కాపురం లో వైస్సార్సీపీ ప్రచారం రథంపై టీడీపీ అల్లరిమూకలు దాడిచేసి, ధ్వసం చేయడం దారుణమైన విషయం అన్నారు. టీడీపీ దాడులతో భయపెట్టాలన్న భ్రమలో ఉంది.. అది మీ వల్లకాని పని అంటూ హెచ్చరించారు. ఇక, టీడీపీ శృతిమించు తోంది.. ప్రచార రథం ధ్వసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తాం అని ప్రకటించారు. మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబుకి మా పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ప్రజలు మాతోనే వున్నారు. అందుకే టీడీపీకి నిద్రపట్టడం లేదని దుయ్యబట్టారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. కాగా, వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబుకి చెందిన ఎన్నికల ప్రచార రథంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.. గుంపుగా వెళ్లి ఒక్కసారిగా వాహనంపై దాడి చేసినట్టు కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి.. ఇది ముమ్మాటికి టీడీపీ పనేఅని వైసీపీ విమర్శిస్తుంది.. ఈ దాడిలో ప్రచార రథానికి ఉన్న ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.