Hari Hara Veera Mallu: ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీల రగడ.. హరిహర వీరమల్లు సినిమా ఫ్లెక్సీలు తొలగింపు!
- ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీల రగడ
- హరిహర వీరమల్లు సినిమా ఫ్లెక్సీలు తొలగింపు
- యధాస్థానంలో ఏర్పాటు చేసిన బాలినేని అనుచరులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hari Hara Veera Mallu flexis removed in Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీల రగడ రచ్చకెక్కింది. డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ మూవీ ఫ్లెక్సీలను తొలగించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఫోటోలతో హరిహర వీరమల్లు ఫ్లెక్సీలు ఒంగోలులో ఏర్పాటు చేశారు. బాలినేని ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించింది. ఫ్లెక్సీల తొలగింపును బాలినేని అనుచరులు తప్పుపట్టారు. మున్సిపల్ అధికారుల అనుమతి ఇవ్వటంతో వివాదం సద్దుమణిగింది. తిరిగి ఫ్లెక్సీలను బాలినేని అనుచరులు యధాస్థానంలో ఏర్పాటు చేశారు.
Also Read
అసెంబ్లీ ఎన్నికల అనంతరం వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బాలినేనికి పవన్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. బాలినేని జనసేనలో చేరికని గత కొంతకాలంగా టీడీపీ, జనసేన క్యాడర్ వ్యతిరేస్తోంది. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 24 రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తన ఫోటోలతో వీరమల్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను తొలగించగా.. మున్సిపల్ అధికారుల అనుమతితో తిరిగి యధాస్థానంలో ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!