నందమూరి బాలకృష్ణ హీరోగా ‘NBK107’ అనే తాత్కాలిక టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి లీకైన పిక్స్, అధికారికంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూసిన నెటిజన్లు ‘NBK107’ కన్నడ హిట్ ‘మఫ్టీ’ నుండి కథ నుంచి ప్రేరణ పొందింది అంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు కొంతమంది డైరెక్ట్ గా చిత్రబృందాన్ని ట్యాగ్ చేస్తూ దీనికి వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. తాజాగా చిత్రబృందం ఆ రూమర్స్ పై స్పందిస్తూ ‘NBK107’ కన్నడ సినిమా కాపీనా? లేదా ? అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది.
Read Also : RC15 video leaked : షూటింగ్ లో చెర్రీ అలా…
‘NBK107’ కన్నడ మూవీ రీమేక్ అంటూ వస్తున్న పుకార్లను కొట్టివేసిన చిత్రబృందం కథ అసలైనదని, మునుపటి ఏ చిత్రాల నుండి ప్రేరణ పొందలేదని పేర్కొంది. వాస్తవానికి ఈ రూమర్ల వెనుక పెద్ద రీజన్ ఉంది. బాలకృష్ణ ‘NBK107’ ఫస్ట్ లుక్ పోస్టర్ ‘మఫ్టీ’లో శివ రాజ్ కుమార్ లుక్‌ని పోలి ఉండటంతో ఈ ఊహాగానాలు బలపడ్డాయి. బాలకృష్ణ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో, డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. బాలయ్య సరసన నటి శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ నటుడు ధునియా విజయ్ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్‌లో నటించేందుకు ఎంపికయ్యారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇందులో కీలకపాత్రలో కనిపించనుంది.