Balakrishna: పీఏలతో తప్పని తిప్పలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలయ్య. నటనను ప్రాణంగా ప్రేమిస్తారు. వయస్సు మీద పడినా.. హీరోయిజం చూపించే పాత్రలు చేయడంలో ఎక్కడా తగ్గడం లేదు. నటనకు ఎంత ప్రయారిటీ ఇస్తారో.. జాతకాలు.. ముహూర్తాలు, దోషాలకు అంతే ప్రాధాన్యం ఇస్తారు. ముహూర్తం లేందే ఏ పనీ చేయరు. కాలు బయట పెట్టరు. ముహూర్తాలపై అంతలా నమ్మకం పెట్టే బాలయ్యకు పాపం.. PAల రూపంలో గండాలు ఎదురవుతున్నాయి. తలనొప్పులు తప్పడం లేదు.
బాలకృష్ణకు కలిసిరాని PAలు
బాలకృష్ణ.. సినిమాల్లో ఎంత పవర్‌ఫుల్ యాక్టరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆయన సక్సెస్‌ను ఎవరూ ఆపలేకపోయారు. హిందూపురం నుంచి వరసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సృష్టించారు. గాలివాటం నాయకుడిగా కాకుండా.. కేడర్‌కు అందుబాటులో ఉండటం.. ఎప్పటికప్పుడు హిందూపురం సమస్యలపై అప్‌డేట్‌గా ఉంటారు. వైసీపీ గాలి బలంగా ఉన్న 2019 ఎన్నికల్లో కూడా ఆయన గతం కంటే ఎక్కువ మెజారిటీ సాధించారు. దీనికి బాలకృష్ణ ఇమేజే అని చెప్పాలి. రాజకీయాలు.. సినిమాలు బ్యాలెన్స్ చేసుకుని వెళ్తుంటారు. ఆయన ఎక్కడ ఉన్నా హిందూపురంపై ఫోకస్ ఉంటుంది. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వాటిమీద ఫోకస్ పెట్టేందుకు ప్రయత్నిస్తారు బాలయ్య. జనంతో సమస్యలు లేని బాలయ్యకు ఇప్పుడు తన సొంత మనుషులతో సమస్యలు వచ్చి పడ్డాయి. బాలయ్యకు అన్నీ కలిసి వస్తున్నాయి కానీ PAలు కలిసి రావడం లేదు. PAలు ఎప్పటికప్పుడు ఆయనకు తలనొప్పిగా మారారు.
Also Read
అప్పట్లో బాలయ్య PA శేఖర్‌కు వ్యతిరేకంగా సొంతపార్టీ నేతలు ప్రెస్‌మీట్
ఎమ్మెల్యేగా బాలకృష్ణ హిందూపురంలో లేని సమయంలో అక్కడ పార్టీ వ్యవహారాలను PAలు చక్కబెడుతుంటారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బాలయ్య పీఏగా ఉన్న శేఖర్ తీవ్ర వివాదాస్పదంగా మారారు. ఎన్నోసార్లు ఆయనపై బాలకృష్ణకు ఫిర్యాదు చేశారు కేడర్. చివరకు సొంతపార్టీ నాయకులే శేఖర్‌కు వ్యతిరేకంగా ఆనాడు ప్రెస్‌మీట్ పెట్టి బహిరంగ విమర్శలు చేశారు కూడా. ఆ గొడవ అప్పట్లో చంద్రబాబు వరకు వెళ్లింది. మొదట్లో ఆ ఆరోపణలను లైట్ తీసుకున్న బాలయ్య.. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పీఏ శేఖర్‌ను తప్పించేశారు.
శేఖర్ స్థానంలో బాలయ్య PAగా వచ్చిన బాలాజీ
శేఖర్ తర్వాత సీన్‌లోకి PAగా టీచర్‌గా పనిచేస్తున్న బాలాజీ వచ్చారు. తొలిరోజుల్లో బాలాజీ బాగానే కనిపించినా.. మెల్లగా ఆయనది కూడా సేమ్ సీన్ అయ్యింది. మళ్లీ విమర్శలు రావడంతో బాలాజీని సాగనంపారు బాలయ్య. అయితే 2019లో మళ్లీ ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలిచాక తిరిగి బాలాజీనే PAగా పెట్టుకున్నారు. అప్పుడు కూడా బాలాజీ నుంచి పెద్దగా విమర్శలు రాలేదు. వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలకు PAతో పెద్దగా పని లేకపోవడమే కారణం. అయితే తాజాగా PA బాలాజీ పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. అది కూడా ఏపీలో కాకుండా హిందూపురానికి సమీపంలో ఉన్న కర్ణాటక గౌరిబిదునూరులోని నగిరిగెర బీఎన్‌ఆర్ రెస్టారెంట్‌లో పోలీసులకు చిక్కారు. ఆ సమయంలో బాలయ్య పీఏ బాలాజీతోపాటు 19 మంది పేకాటరాయుళ్లును అరెస్ట్ చేశారు.
PAలతో ఇబ్బందులు పడుతున్న బాలయ్య
ఏపీలో పేకాట ఆడితే పోలీసులు టార్గెట్ చేస్తారని అనుకున్నారో ఏమో.. సేఫ్ ప్లేస్‌గా బోర్డర్‌లో ఉన్న కర్ణాటకను అడ్డగా చేసుకున్నారు బాలాజీ. మరి.. కర్నాటక పోలీసులే స్వయంగా దాడి చేశారో లేక.. AP పోలీసులు ఉప్పందించారో కానీ రైడ్ జరిగింది. బాలకృష్ణ PA దొరికిపోయారు. ఇక్కడ పోలీసులకు చిక్కింది బాలాజీనే అయినా.. బాలకృష్ణ PA పట్టుబడ్డారన్నదే రచ్చ రచ్చ అయింది. ఇప్పటికే పీఏలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలయ్య.. తాజా వివాదంతో బాలాజీని కొనసాగించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!