బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! కొన్ని రోజుల నుంచి ఈ సినిమా విషయంలో తాను చాలా ఎగ్జైట్‌గా ఉన్నానని చెప్తూ వస్తోన్న అనిల్.. ఆ ఎగ్జైట్‌మెంట్‌లోనే తాజాగా మూడు మేజర్ అప్డేట్స్ ఇచ్చేశాడు. మొదటిది.. ఈ సినిమా కథ తండ్రి, కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది. రెండోది.. ఇందులో బాలయ్య 45 ఏళ్ళ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. మూడోది.. సెప్టెంబర్ నుంచే ఇది సెట్స్ మీదకి వెళ్తుంది.
ఎఫ్3 ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా లేటెస్ట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అనిల్ ఆ అప్డేట్స్ ఇచ్చాడు. బాలయ్య క్యారెక్టరైజేషన్ చాలా స్పెషల్‌గా ఉంటుందని, ఇందులో ఫ్యాన్ మూమెంట్స్ కూడా చాలా ఉంటాయని తెలిపాడు. తన మార్క్ కామెడీ, కమర్షియల్ అంశాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ పుష్కలంగా ఉండనున్నట్టు అనిల్ కన్ఫమ్ చేశాడు. ఇక బాలయ్య కూతురిగా ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీలీలా నటిస్తోందని అనిల్ తెలిపాడు. ఆమె అయితేనే ఆ పాత్రకి సూటవుతుందని, అందుకే ఏరికోరి మరీ శ్రీలీలాని తీసుకున్నామని అనిల్ చెప్పుకొచ్చాడు.
నిజానికి.. శ్రీలీలా పేరు తెరమీదకొచ్చినప్పుడు, ఆమె బాలయ్యతో జోడీ కట్టనుందేమోనని అంతా అనుకున్నారు. కానీ, ఆ వార్తల్ని ఖండిస్తూ కూతురిగా నటించనుందని అనిల్ క్లారిటీ ఇచ్చాడు. బాలయ్య సరసన ఓ స్టార్ హీరోయిన్‌ని రంగంలోకి దింపుతున్నారని సమాచారం. కాగా.. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇది ముగిసిన వెంటనే, అనిల్ రావిపూడితో సెట్స్ మీదకి వెళ్లనున్నారు.