వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఏడేళ్ళ శిక్ష లోపు సెక్షన్లు నమోదు అయ్యాయని.. ఇలాంటి పరిస్థితుల్లో నిందితుడు నీ టచ్ చేయవద్దని సుప్రీం కోర్టు క్లియర్ గా చెప్పిందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫు లాయర్ అన్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్లలోని పోలింగ్ కేంద్రంలో దూరి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ1గా చేర్చారు. ఆయన గత కొన్ని రోజులుగా అందుబాటులో లేకపోవడంతో ఆయన కోసం ఏపీ, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు.
పూణెలో ఇద్దరు ఐటీ నిపుణుల మృతికి కారణమైన బాలుడికి గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరు చేయడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మహారాష్ట్రలోనూ బాధిత కుటుంబాలు, ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తం చేయడంతో న్యాయస్థానం దిగొచ్చింది.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. కొద్దిసేపటి క్రితం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. శుక్రవారం ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను గురువారం లేదా వచ్చే వారం విచారించే అవకాశం ఉంది.
జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేస్తే.. అధికారిక విధులను నిర్వహించొద్దని సుప్రీంకోర్టు మంగళవారం అభిప్రాయపడింది.
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్‌ను నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
MLC Kavitha: ఇవాళ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్ట్ తీర్పు ఇవ్వనుంది. సీబీఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై జడ్జి కావేరి బవేజా తీర్పు వెలువరించనుంది.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు నిరాకరించింది.