జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు నిరాకరించింది. తన మామ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు 13 రోజుల మధ్యంతర బెయిల్ కోసం హేమంత్ కోర్టును ఆశ్రయించారు. అందుకు బెయిల్ మంజూరు చేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో మరోసారి హేమంత్‌కు నిరాశ ఎదురైంది.
ఇది కూడా చదవండి: Mumbai: ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్.. కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కొన్ని రోజులు ఈడీ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే తన వారసుడిగా చంపయ్ సోరెన్ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ఇదిలా ఉంటే హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. జార్ఖండ్‌లోని గాండే శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికలో ఆమె పోటీ చేస్తున్నారు. గతంలో హేమంత్ సోరెన్ రాజీనామా చేసినప్పుడు.. కల్పనానే సీఎం పదవిలో ఉంటారని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో బెడిసికొట్టింది. అభ్యంతరాలు రావడంతో వెనక్కి తగ్గారు.
ఇది కూడా చదవండి: Nayanthara: నయనతార ధరించిన ఈ వాచ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..