మనీలాండరింగ్ కేసులో ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. అందుకు ధర్మాసనం అనుమతిచ్చింది. మనీలాండరింగ్ కేసులో 2022, మే నెలలో సత్యేందర్ జైన్ అరెస్ట్ అయ్యారు.
రేణుకాస్వామి హత్యకేసులో ముగ్గురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. అంతేకాకుండా.. వారిపై హత్యానేరం ఎత్తివేసింది. నిందితుడు కేశవ్ మూర్తికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో ఇద్దరు నిందితులు కార్తీక్, నిఖిల్‌లకు కూడా బెంగళూరు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
గురుగ్రామ్‌లో కారు-బైక్ ప్రమాదం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రాంగ్ రూట్‌లో కారు రావడంతో అత్యంత వేగంగా దూసుకెళ్తున్న బైకర్ ఢీకొని 23 ఏళ్ల అక్షత్ గార్గ్ ప్రాణాలు వదిలాడు. రాంగ్ సైడ్‌లో ఎస్‌యూవీ కారును నడిపిన వ్యక్తికి వెంటనే బెయిల్ లభించింది. దీంతో అతడికి ఎందుకు బెయిల్ ఇచ్చారంటూ గురుగ్రామ్ ప్రమాద బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
Arvind Kejriwal's Bail: మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట దొరికింది. ఈ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో ఇద్దరు నిందితులకు బెయిల్ లభించింది. మనీ లాండరింగ్ కేసులో మద్యం వ్యాపారి సమీర్ మహేంద్ర, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వాలంటీర్ చన్‌ప్రీత్ సింగ్‌లకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కవిత, విజయ్ నాయర్ కూడా ఇదే కేసులో బెయిల్‌పై బయటకు వచ్చారు. అనంతరం.. ఈ ఇద్దరికీ బెయిల్ మంజూరైంది.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బెయిల్ పై విచారణ జరుగుతున్నప్పుడు జడ్జి చెప్పే వరకు తెలియదు.. కానీ కవిత బెయిల్ పై మూడు నాలుగు రోజుల నుండి కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేసిందని తెలిపారు. కేటీఆర్ రెండు రోజుల ముందే ఢిల్లీలో హడావుడి చేశారని.. జడ్జి చెప్పాల్సిన జడ్జిమెంట్ బీఆర్ఎస్ చెప్పేసిందని పేర్కొన్నారు.
కవితపై ఈడీ కేసుపై కవిత న్యాయవాది మోహిత్ రావు మాట్లాడుతూ, ఈడీది పూర్తిగా అసంబద్ధ దర్యాప్తు అని ఆరోపించారు. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో అరెస్టు అయిన తర్వాత ఇచ్చిన వాటిని మాత్రమే దర్యాప్తు సంస్థ పరిగణలోకి తీసుకుందని తెలిపారు. కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన వారు కేసులో నిందితులుగా కూడా లేరని అన్నారు. సెక్షన్ 45 ప్రకారం మహిళకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు. బండి సంజయ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం సహా రెండు కేసుల్లో పిన్నెల్లికి ఏపీ ఉన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.