చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డికి రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 15 వేలు రెండు పూచ్చీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే.. గత ఫిబ్రవరి ఈ నెల 7న 20 మంది నిందితులు (మహిళలు, పురుషులు) సీఎస్ రంగరాజన్ ఇంటికి వెళ్లారు. రామదండు కోసం మనుషులను రిక్రూట్ చేయాలని, అలానే ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ అందుకు వ్యతిరేకించినందుకు…
అన్ని కేసుల్లో బెయిల్స్ పోసాని కృష్ణ మురళికి సంబంధిత న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చాయి. నిన్న నర్సారావుపేట కోర్టు, ఇవాళ ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్స్ మంజూరు చేశాయి. అంతకుముందే రాజంపేట కోర్టు బెయిల్ ఇచ్చింది. పోసానిపై మొత్తంగా 17 కేసులు నమోదయ్యాయి. మహాశివరాత్రి రోజు, ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య పోలీసుల అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.
పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట లభించింది. కర్నూలు జే ఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేశారు. నిన్ననే పోసాని కస్టడీ పిటిషన్ ను మేజిస్ట్రేట్ డిస్మిస్ చేసింది. తాజాగా బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను దూషించిన కేసులో నిందితుడు పోసాని.. ఈనెల 5వ తేదీ నుంచి కర్నూలు జైలులో ఉన్నారు. ఆదోని త్రీ టౌన్ పీఎస్ లో జనసేన నేత రేణువర్మ…
సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నాయకుడు చక్రధర్‌గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులు వంశీకృష్ణ, సంతోషకుమార్, పరశురామ్ తరఫు న్యాయవాది లక్ష్మణ్ పిటిషన్ దాఖలు చేయగా.. ఒక్కొక్కరు రూ.20 వేల పూచీకత్తు, రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశిస్తూ బెయిల్ ఇచ్చింది.
లగచర్లలో అధికారులపై దాడి కేసులో నిందితులందరికీ నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ను మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డితో పాటు సురేష్, మిగతా నిందితులు అందరికీ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
తమిళ స్టార్ హీరో రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ పై గత కొన్నేళ్లుగా చెన్నైకి చెందిన యాడ్ ఏజెన్సీ కంపెనీ న్యాయ పోరాటం చేస్తోంది.. ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన కొచ్చాడియాన్ సినిమా ప్రొడక్షన్ సమయంలో .. యాడ్ ఏజెన్సీ కంపెనీ నుంచి తీసుకున్న ఋణం..తిరిగి ఇవ్వకపోవడంపై లతా రజినీకాంత్పై చీటింగ్ కేసు నమోదయ్యింది.. దీంతో ఈ కేసు పై అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది.. దీనిపై పెద్ద చర్చే జరిగింది.. ఇక ఇది కాస్త బెంగళూరులోని…
Kothapalli Geetha: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టు ఊరట లభించింది. బ్యాంకును మోసం చేశారన్న కేసులో కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్తకు రెండు రోజుల కిందట నాంపల్లి సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించగా.. సీబీఐ కోర్టు తీర్పును కొత్తపల్లి గీత దంపతులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన హైకోర్టు సీబీఐ కోర్టు తీర్పు అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా కొత్తపల్లి గీత, ఆమె…
సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి హడావిడిగా అరెస్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును శుక్రవారం అర్ధరాత్రి బెయిల్‌పై విడుదల చేశారు. సుమారు 18 గంటల పాటు సీఐడీ పోలీసులు తమ అధీనంలోనే ఉంచుకున్నారు. అనంతరం పోలీసులు విజయవాడ కోర్టుకు తరలించారు. సీఐడీ కోర్టు ఇంఛార్జి న్యాయమూర్తి సత్యవతి బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో అశోక్‌బాబును పోలీసులు విడుదల చేశారు. ఆయనకు రూ.20వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుతో సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు…
టీడీపీ నేత కూన రవి కుమార్ కి శరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రాష్ట్రాన్ని వదిలివెల్లోద్దని కూనరవికుమార్ కి ఆదేశం ఇచ్చింది. అయితే కూన రవి కుమార్ మాట్లాడుతూ… భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం కల్పిస్తున్నారు. కనీసం నోటీసు ఇవ్వకుండా… ఇంటి వద్దకు వచ్చారు. నేను ఏటువంటి నిరసనకు పిలుపు ఇవ్వలేదు. నన్ను ఏందుకు అడ్డుకుంటున్నారో కనీసం చెప్పలేదు . ఇప్పటికి మూడు తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పటికి పదిసార్లు పోలీసులు ఇష్టారాజ్యంగా ఇంట్లోకి…