Chilkur Balaji Temple Priest: పూజారి రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్
- బెయిల్ మంజూరు చేసిన రాజేంద్రనగర్ కోర్టు
- రూ.15 వేలు రెండు పూచ్చీకత్తులు సమర్పించాలని ఆదేశం
- ఈ ఘటన గురించి పూర్తి సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డికి రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 15 వేలు రెండు పూచ్చీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే.. గత ఫిబ్రవరి ఈ నెల 7న 20 మంది నిందితులు (మహిళలు, పురుషులు) సీఎస్ రంగరాజన్ ఇంటికి వెళ్లారు. రామదండు కోసం మనుషులను రిక్రూట్ చేయాలని, అలానే ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ అందుకు వ్యతిరేకించినందుకు మొహం, శరీరంపై దాడికి పాల్పడ్డారు. మణికొండ పంచవటి కాలనీలో ఈనెల 8న వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో చేసిన నేరాన్ని రాఘవ రెడ్డి ఒప్పుకున్నాడు. దాడికి ముందు ఏ2గా ఉన్న నిందితుడు సాయన్నను దమ్మాయిగూడలోని ఉదా రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కలుసుకున్నారు. రాఘవ రెడ్డి 2014లో ఆంధ్ర అసోసియేషన్ ఫర్ తెలంగాణ, ఆంద్ర పీపుల్ పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేశాడు. హిందూ ధర్మాన్ని కాపాడతానని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ప్రత్యేక ఫోర్స్ ను సిద్దం చేయాని భావించాడు. ఇందు కోసం ఫేస్ బుక్, యూట్యూబ్ ఛానెళ్ళు ఏర్పాటు చేసి ప్రసంగాలు ఇచ్చి ప్రేరేపించాడు.
READ MORE: Rabiya Khatoon : రబియా.. ఖాతూన్ లేటెస్ట్ గ్లామరస్ పిక్స్
Also Read
- IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
- Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
రాఘవ రెడ్డి మణికొండలో నూతన న్యాయ చట్టాలపై అవగాహన కోసం సమావేశం ఏర్పాటు చేశాడు. 2022లో భార్యను చైర్మన్ గా పెట్టి కోసలేంద్ర ట్రస్ట్ ప్రారంభించాడు. దీని ద్వారా ఫండ్ కలెక్ట్ చేశాడు. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన శ్యామ్ అనే వ్యక్తి సాయంతో రామరాజ్యం వెబ్ సైట్ ను ప్రారంభించాడు. 10 నెలల క్రితం రాఘవ రెడ్డి ఓ యూట్యూబ్ ఫాలోవర్ ద్వారా జనవరి 25న రంగారాజన్ ను కలిశాడు. అతను చెప్పి ప్రతిపాదనకు రంగరాజన్ స్పందించలేదు. నిందితులు గత నెల 25న పెనుగొండలోని వాసవి కన్యాకాపరమేశ్వరి గుడిలో కలుసుకున్నారు. ఈ నెల 4న రాఘవ రెడ్డి స్నేహితుడు, న్యాయవాది అయిన దామోదర్ రెడ్డి సాయంతో దమ్మాయిగూడలో ఉదా రెడ్డి ఇంట్లో కలుసుకున్నారు. రంగరాజన్ ను మరోసారి కలిసి మాట్లాడాలని, వినకుంటే దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కేసులో తాజాగా నిందితుడికి బెయిల్ లభించింది.
తాజావార్తలు
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?