పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మరో మైలురాయి సాధించాడు. శుక్రవారం సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్‌లను బాబర్ ఆజం వెనక్కి నెట్టాడు. టీ20ల్లో వేగంగా 11000 T20 పరుగులు సాధించాడు. ఆజం.. 298 ఇన్నింగ్స్‌ల్లోనే 11000 పరుగుల మైలురాయిని సాధించాడు. బాబర్‌కు ముందు.. 314 ఇన్నింగ్స్‌లలో ఈ ఫార్మాట్లో వెస్టిండీస్ లెజెండ్ గేల్ అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు.…
పాకిస్థాన్ క్రికెట్లో గందరగోళం నెలకొటోంది. ఇటీవల బాబర్ ఆజం వైట్‌బాల్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అంతే కాకుండా సెలక్షన్ కమిటీలో సైతం మార్పులు జరిగాయి. తాజాగా ఇప్పుడు 2011లో భారత్‌ను వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు.
Pakistan: జింబాబ్వే, ఆస్ట్రేలియా పర్యటనలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. అయితే ఇందులో జింబాబ్వే పర్యటనలో మాజీ కెప్టెన్ బాబర్ ఆజం జట్టులో భాగం కావడం లేదు. జింబాబ్వే పర్యటనలో ఫాస్ట్ బౌలర్లు షహీన్ అఫ్రిది, నసీమ్ షాలకు కూడా విశ్రాంతి కల్పించారు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి రెండు టెస్టు మ్యాచ్‌లకు కూడా బాబర్, షాహీన్, నసీమ్ పాకిస్థాన్ జట్టులో లేరు. అయితే, ఆస్ట్రేలియా టూర్లో బాబర్, షాహీన్, నసీమ్‌లు రెండు జట్లలోనూ ఉన్నారు.…
ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాడు కమ్రాన్ గులామ్ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 2024 అక్టోబర్ 10న అతనికి 29 ఏళ్లు నిండాయి. కాగా.. గులామ్ తన అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించాడు. అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన 13వ పాక్ క్రికెటర్‌గా నిలిచాడు.
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్ టీమ్ హవా నడించింది. సొంతగడ్డపైనే కాక.. విదేశాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది. 1992లో వన్డే ప్రపంచకప్, 2009లో టీ20 ప్రపంచకప్‌లను గెలిచింది. అలాంటి టీమ్ ప్రస్తుతం అనూహ్య ఓటములను ఎదుర్కొంటోంది. పసికూనల చేతుల్లో కూడా ఓడిపోతోంది. ఘన ప్రస్థానం నుంచి.. పాకిస్తాన్ పతనం వైపు వేగంగా అడుగులేస్తోందా? అంటే.. అవుననే సమాధానం వస్తోంది. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ ఆట తీరు రోజురోజుకు పడిపోతోంది. టీ20ల్లో ఐర్లాండ్ చేతిలో ఓడిన పాక్.. టీ20 ప్రపంచకప్…
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ 30, 5 పరుగులే చేశాడు. పేలవ ఫామ్ కారణంగా ఇంగ్లండ్‌తో మిగతా రెండు టెస్టుల కోసం ప్రకటించిన పాకిస్థాన్ జట్టులో బాబర్‌కు చోటు దక్కలేదు. బాబర్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై విమర్శలు వస్తున్నాయి. వీటిపై పాక్ అసిస్టెంట్ కోచ్ అజార్ మహముద్ స్పందించాడు. బాబర్‌ను జట్టు…
Ravichandran Ashwin: ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టు కష్టకాలంలో ఉంది. ఆసియా కప్ 2023 నుంచి జట్టు ఒక్కో విజయం కోసం తెగ పోరాడుతుంది. 2023 ప్రపంచ కప్‌లో జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకోకపోవడం, ఇక 2024 T20 ప్రపంచ కప్‌లో మొదటి రౌండ్ నుండి నిష్క్రమన., ఇప్పుడు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో ఓటమి, కెప్టెన్సీని తరచూ మార్చడం వంటి కారణాలతో జట్టులో అస్థిరత వాతావరణం నెలకొంది. ఈ విషయంపై తాజాగా భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆందోళన…
Mohammad Rizwan in Race For Pakistan Captain: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి తాను రాజీనామా చేసినట్లు ఎక్స్‌లో మంగళవారం పోస్టు పెట్టాడు. వ్యక్తిగత ప్రదర్శనపై మరింత దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. సారథ్య బాధ్యతల నుంచి బాబర్ తప్పుకోవడంతో.. తదుపరి కెప్టెన్‌గా ఎవరు ఉంటారనేది ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిగా మారింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈసారి కొత్త…
Babar Azam Captaincy: పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ అజామ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాక్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనపై మరింత దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం రాత్రి ఎక్స్ వేదికగా తెలిపాడు. పాక్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఎంతో గౌరవం అని, అయితే కెప్టెన్సీని వదులుకొని ఆటపై మరింత దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నాడు. టెస్టుల్లో షాన్ మసూద్ సారథిగా కొనసాగుతున్న విషయం…