టీ20లలో న్యూజిలాండ్‌పై ఘోర పరాజయం పాలైన పాకిస్తాన్.. వన్డేలలో కూడా అదే అలవాటుగా మారింది. తాజాగా కివీస్‌తో జరిగిన మొదటి వన్డేలో పాక్ 73 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నేపియర్‌లోని మెక్‌లీన్ పార్క్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ కేవలం 22 పరుగుల తేడాతో ఏడు వికెట్లు కోల్పోయి 73 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 69 బంతుల్లో 96 పరుగులు అవసరం కాగా.. క్రీజులో బాబర్ అజామ్ చక్కగా ఆడుతున్నప్పటికీ.. న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగారు. పాకిస్తాన్ బ్యాటర్లను వెంట వెంటనే పెవిలియన్‌కు పంపించారు.
Read Also: Amit Shah: ‘‘ఆయుధాలు మార్పు తీసుకురాలేవు’’.. మావోయిస్టులకు అమిత్ షా హితవు..
న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో మార్క్ చాప్మన్, నాథన్ స్మిత్, ముహమ్మద్ అబ్బాస్ అద్భుతంగా రాణించారు. చాప్మన్ 111 బంతుల్లో 132 పరుగులు సాధించగా.. అబ్బాస్ కేవలం 24 బంతుల్లోనే వేగవంతమైన అర్ధ సెంచరీతో తన వన్డే అరంగేట్రం చేశాడు. బౌలింగ్‌లో స్మిత్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కీలకమైన 4 వికెట్లు పడగొట్టాడు. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 344/9 భారీ స్కోరు చేసింది. ప్రారంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన కివీస్.. డారిల్ మిచెల్ తో కలిసి చాప్మన్ 199 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మిచెల్ 84 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. చివరి ఓవర్లలో అబ్బాస్ 26 బంతుల్లో 52 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బౌలింగ్‌లో.. ఇర్ఫాన్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. హారిస్ రౌఫ్, అకీఫ్ జావెద్ తలో 2 వికెట్లు తీశారు. నసీం షా, మహమ్మద్ అలీ తలో వికెట్ సంపాదించారు.
Read Also: Kajol : లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన స్టార్ హీరోయిన్.. ఎన్ని కోట్లకో తెలుసా..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. అబ్దుల్లా షఫీక్ (36), ఉస్మాన్ ఖాన్ (39) లు 12.4 ఓవర్లలో 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత రిజ్వాన్ 34 బంతుల్లో 30 పరుగులు చేశాడు. బాబర్ అజామ్ 78 పరుగులు చేశాడు. సల్మాన్ అలీ ఆఘా 58 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా పరుగులు చేయడంలో విఫలమయ్యారు.