దేశ ప్రజలు రామ్ లల్లా దర్శనం చేసుకునేలా ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించబోతోంది. బీజేపీ శ్రీరామజన్మభూమి దర్శన ప్రచారం రేపటి నుంచి ప్రారంభం కానుంది. అయోధ్యకు చెందిన కమలం పార్టీ నాయకులకు పార్టీ హైకమాండ్ పనులు అప్పగించింది.
అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు భారీగా వచ్చారు. రామభక్తులు వేకువజామున 3 గంటలకే పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు.
Ram Mandir : అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి విశిష్ట అతిథులు హాజరయ్యారు. సోమవారం కొత్తగా నిర్మించిన విమానాశ్రయంలో దాదాపు 100 చార్టర్డ్ విమానాలు లాండ్ అయ్యాయి.
Ayodhya : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రామభక్తులు బాలరాముడిని చూసేందుకు ఎదురుచూస్తున్నారు. నేటి నుంచి సామాన్య భక్తులకు శ్రీరాముడి దర్శన భాగ్యం కలుగుతుందని ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.
ఈరోజు అయోధ్యలో జరిగిన రామ్ లల్లా ప్రాణప్రతిష్ట మహోత్సవానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఆయన అయోధ్యలోని రామమందిర ట్రస్ట్‌కు రూ.2.51 కోట్లు విరాళంగా అందజేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి రూ. 2.51 కోట్లు విరాళంగా ఇచ్చారని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖేష్ అంబానీ తన భార్య నీతా, కుమార్తె ఇషా,…
సోమవారం అయోధ్యలోని రామ మందిరం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కోట్లాది మంది రామభక్తులకు మరపురాని రోజని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ క్షణం కోసం ఎన్నో తరాలు ఎదురుచూశాయని, అయితే రామజన్మభూమిలో మళ్లీ ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని, నమ్మకాన్ని ఏవీ వమ్ము చేయలేదని షా అన్నారు. మరోవైపు.. రామమందిరం కోసం ప్రాణత్యాగం చేసిన వారందరికీ నివాళులు అర్పించారని తెలిపారు. వారు ఎన్నో అవమానాలు, చిత్రహింసలు ఎదుర్కొన్నారని అయితే మత మార్గాన్ని వీడలేదని షా…
Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట చేశారు. శతాబ్ధాల కల ఈ రోజు నెరవేరిందని రామ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా పలువురు వివిధ చర్యల ద్వారా రామ భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఒడిశాకు చెందిన చేనేత కుటుంబం ‘రామాయణ గాథ’తో చీరను తయారు చేశారు. ఇది చూపరులను ఆకట్టుకుంటుంది.
అయోధ్యలో సరయూ నది తీరాన దీపోత్సవం కన్నులపండగగా సాగింది. సరయూ నది తీరాన భక్తులు 14 లక్షల దీపాలు వెలిగించారు. దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలతో దీపాలంకరణ చేశారు. అటు.. జనక్‌పూర్ ధామ్‌లోని జానకి ఆలయంలో కూడా దీపోత్సవం నిర్వహించారు. ఆ సమయంలోనే.. అయోధ్యలోని హనుమాన్‌గర్హి ఆలయంలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. జయజయ ధ్వానాల మధ్య బాలరాముడు ఆలయంలో కొలువుదీరారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అభిజిత్ లఘ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. కాగా.. రాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తొలిసారి స్పందించారు. భూమిపై అత్యంత అదృష్టవంతుడని భావిస్తున్నానని ఆయన అమితానందం వ్యక్తం చేశారు. ఇదంతా కల మాదిరిగా అనిపిస్తోందని అన్నారు. "నా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, ఆ భగవంతుడు శ్రీరాముడి ఆశీర్వచనాలు నాకు ఎప్పటికీ ఉంటాయి.…