PM Modi: రాముడు వివాదం కాదు, పరిష్కారం.. ప్రధాని మోడీ ప్రసంగంలో 10 కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కన్నులపండుగగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా “రామ్ లల్లా” విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా వీవీఐపీలు, సాధువులు, సాధారణ భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చారు. రామ మందిర ప్రారంభం తర్వాత ప్రధాని నరేంద్రమోడీ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఇకపై రామ్ లల్లా టెంట్‌లో ఉండరని, గొప్ప ఆలయంలో ఉంటారని అన్నారు.
Read Also: CM Siddaramaiah: మేము గాంధీ రాముడిని పూజిస్తాం, బీజేపీ రాముడిని కాదు.. కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు
Also Read
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
- Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
ప్రధాని మోడీ ప్రసంగంలోని కీలక వ్యాఖ్యలు:
1) రామ మందిర జాప్యానికి తాను రాముడికి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. శతాబ్ధాల పాటు మనం చూపిన సహనం, మనం చేసిన త్యాగాల తర్వాత మా రామ్ లల్లా వచ్చారు.
2) జనవరి 22, 2024 కేవలం తేదీ మాత్రమే కాదు, కొత్త శకానికి నాంది. రామమందిర నిర్మాణం ప్రజల్లో కొత్త శక్తిని నింపింది.
3) రామ మందిర నిర్మాణం చేపడితే అగ్ని జ్వాలలు చెలరేగుతుందని అన్నారు, రాముడు అగ్ని కాదు శక్తి. రాముడు వివాదం కాదు, పరిష్కారం.
4) మనం ఇప్పుడు రాబోయే 1000 ఏళ్ల భారతదేశానికి పునాది వేయాలి. ఈ క్షణం నుంచి సమర్థవంతమైన, గొప్ప, దైవిక భారతదేశానన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.
5) రామ మందిరం నిర్మాణం భారతీయ సమాజ పరిపక్వతకు ప్రతిబింబం. ఇది కేవలం విజయానికి మాత్రమే కాదు, వినయానికి కూడా ఒక సందర్భం.
6) రాముడి ఉనికి ప్రశ్నార్థంగా మారింది. న్యాయం చేసినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. చట్టానికి అనుగుణంగా ఆలయాన్ని నిర్మించారు.
7) రామ్ లల్లా ఇప్పుడు టెంట్‌లో ఉండరు.. గ్రాండ్ టెంపుల్‌లో ఉంటారు.
8) సాగర్ నుంచి సరయు వరకు ప్రయాణించే అవకాశం నాకు లభించింది. సాగరం నుంచి సరయు వరకు రామనామ వినిపిస్తోంది. పండగ స్పూర్తి కనిపిస్తోంది.
9) జనవరి 22, 2024 క్యాలెండర్లో తేదీ మాత్రమే కాదు, ఇది కొత్త కాలచక్రానికి మూలం
10) రామ మందిరం ఇంత ఆలస్యంపై రాముడికి క్షమాపణలు చెబుతున్నా. ఇన్ని రోజులు రాముడికి, ప్రజలకు మధ్య దూరం, ఈ రోజుతో ముగిసింది.
తాజావార్తలు
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్‌టాప్‌లు భారత్‌లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్‌ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..