AUS Vs ENG: వరుణుడి ఖాతాలో నాలుగో మ్యాచ్.. మెగా టోర్నీలో మరో కీలక మ్యాచ్ రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AUS Vs ENG: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే వరుణుడి వల్ల మూడు మ్యాచ్‌లు వాష్ అవుట్ కాగా శుక్రవారం వరుసగా రెండో మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలుత వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అవుతుందని అభిమానులు ఆశించారు. కానీ వర్షం తగ్గినా మైదానం పూర్తిగా తడిగా ఉండటంతో మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాదని అంపైర్లు స్పష్టం చేశారు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఖాతాలో చెరో పాయింట్‌ను జమ చేశారు.
Read Also: PAK Vs ZIM: పాకిస్థాన్, జింబాబ్వే మధ్య శత్రుత్వానికి మిస్టర్ బీన్ కారణమా?
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
గ్రూప్-1లో వర్షం కారణంగా ఇప్పటికే మూడు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. శుక్రవారం ఆప్ఘనిస్తాన్-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయ్యింది. అంతకుముందు న్యూజిలాండ్-ఆప్ఘనిస్తాన్ మ్యాచ్‌ను కూడా వరుణుడు అడ్డుకున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగానే తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఈ గ్రూప్‌లో సెమీస్‌కు ఎవరు వెళ్తారన్న విషయం ఆసక్తిగా మారింది. గతంలో న్యూజిలాండ్ చేతిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్ చేతిలో ఇంగ్లండ్ ఓటమిపాలయ్యాయి. దీంతో ఈ రెండు జట్లకు ఇవాళ్టి మ్యాచ్ కీలకం అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ అనూహ్యంగా మ్యాచ్ రద్దు కావడం సెమీస్ సమీకరణాలపై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం గ్రూప్-1లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా నెట్ రన్‌రేట్ ప్రకారం ఇంగ్లండ్ రెండో స్థానంలో, ఐర్లాండ్ మూడో స్థానంలో నిలిచాయి. ఆస్ట్రేలియా, శ్రీలంక, ఆప్ఘనిస్తాన్ ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!