తెలుగు రాష్ట్రాలలో క్రికెట్ ప్రియులకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. బంగ్లాదేశ్‌తో సిరీస్ తర్వాత టీమిండియా స్వదేశంలో వరుసగా శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో సిరీస్‌లు ఆడనుంది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. వీటిలో హైదరాబాద్, విశాఖలకు కూడా మ్యాచ్‌లను కేటాయించింది. జనవరి 18న హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో టీమిండియా తొలి వన్డే ఆడనుండగా… మార్చి 19న విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడనుంది. మూడు నెలల కాలంలో తెలుగు రాష్ట్రాలలో రెండు అంతర్జాతీయ…
Ricky Ponting: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కోలుకున్నాడు. శుక్రవారం నాడు ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టెస్టు మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా కామెంటరీ చేస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో పాంటింగ్‌ను ఆసుప్రతికి తరలించారు. దీంతో అతని అభిమానులు ఆందోళనకు గురయ్యారు. గుండెపోటు వచ్చిందనే వార్తలు రావడంతో మరింత కంగారుపడ్డారు. అయితే ప్రస్తుతం పాంటింగ్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. శనివారం అతడు మళ్లీ మైదానంలోకి దిగి కామెంటరీ మొదలుపెట్టాడు. ఈ మేరకు ఓ వీడియోను కూడా షేర్…
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఈ ఆసీస్ లెజెండ్.. మూడో రోజు ఆటలో భాగంగా కామెంట్రీ చెబుతూ కుప్పకూలాడు.
Naked PhotoShoot: అప్పుడే సూర్యుడు ఉదయించేందుకు సిద్ధమవుతున్నాడు. నెమ్మదిగా తెల్లారుతోంది. అదే సమయంలో ఆస్ట్రేలియా సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద 2,500 మంది నగ్నంగా నిలబడి ఉన్నారు. ఎందుకో అనుకోమాకండి. వాళ్లంతా ఫోటో షూట్లో పాల్గొన్నారు. అయితే వీరు మంచి కాజ్ కోసమే నగ్నంగా ఫోటోలకు పోజులిచ్చారు. వివరాల్లోకి వెళ్తే ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. తాజా నివేదిక ప్రకారం 70 సంవత్సరాల వయస్సులోపు ప్రతి ముగ్గురిలో ఇద్దరు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చర్మ…
Australian police identify serial rapist, 40 years after first assault using DNA technology: ఆస్ట్రేలియాలో సీరియల్ రేపిస్టు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఏకంగా 15 ఏళ్ల వ్యవధిలో 31 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. అయితే చివరకు టెక్నాలజీ ద్వారా నిందితుడిని గుర్తించారు ఆస్ట్రేలియా పోలీసులు. 40 ఏళ్ల క్రితం తను మొదటిసారిగా మహిళపై అత్యాచారాలను ప్రారంభించాడు. కీత్ సిమ్స్ 1985 నుంచి 2001 మధ్య మొత్తం 31 మంది మహిళలపై లైంగిక…
FIFA World Cup: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో వరుసగా రెండో రోజు కూడా సంచలనం నమోదైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాను పసికూడ సౌదీ అరేబియా ఓడించి చరిత్ర సృష్టించింది. బుధవారం కూడా మరో సంచలనం నమోదైంది. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో జపాన్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ధ భాగం ముగిసే సరికి జర్మనీ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.…
Costly Medicine: మాములుగా అనారోగ్యానికి గురైతే కొనుగోలు చేసే ఔషధాల ధరలు మహా అయితే వేలల్లో లేదా లక్షల్లో మాత్రమే ఉంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం తాజాగా మార్కెట్లో విడుదలైంది. ‘హిమోఫిలియా బి’ అనే సమస్యకు ఈ ఔషధాన్ని సీఎస్ఎల్ లిమిటెడ్ తయారుచేసింది. రక్తం గడ్డ కట్టడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలతో కూడిన అరుదైన ఈ లోపానికి అందుబాటులోకి వచ్చిన తొలి జన్యుపరమైన చికిత్స ఇదే. ఆస్ట్రేలియాలో ఈ ఔషధం ధరను 3.5 మిలియన్…
Aus Vs Eng: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్‌కు వన్డే ఫార్మాట్లో ఆస్ట్రేలియా చుక్కలు చూపించింది. మూడు వన్డేల సిరీస్‌లో ఆ జట్టును 3-0 తేడాతో వైట్ వాష్ చేసింది. విచిత్రం ఏంటంటే ఈ సిరీస్‌లో ఆడుతోంది టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టేనా అని చాలా మందికి అనుమానం వచ్చింది. అంత ఘోరంగా ఈ వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రదర్శన చేసింది. ముఖ్యంగా మూడో వన్డేలో ఇంగ్లండ్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.…
T20 World Cup Final 2022: ఆస్ట్రేలియా మెల్బోర్న్ వేదికగా జరగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ తక్కువ సోరుకే పరిమితం అయింది. ఇంగ్లాండ్ బౌలింగ్ ధాటికి పాకిస్తాన్ బ్యాటర్లు తట్టుకోలేకపోయారు. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులకు మాత్రమే పరిమితం అయింది. ఇంగ్లాండ్ ముందు 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.