Australian police have offered a reward of Rs 5 crore for an Indian man in a beach murder case: భారతీయ వ్యక్తిపై ఆస్ట్రేలియన్ పోలీసులు ఏకంగా ఒక మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. భారతీయ కరెన్సీలో దాదాపుగా రూ.5 కోట్ల భారీ రివార్డు ఇది. నాలుగేళ్ల క్రితం 2018లో ఆస్ట్రేలియన్ బీచ్ లో ఓ హత్య చేసిన తర్వాత పారిపోయిన భారతీయ వ్యక్తి కోసం ఆస్ట్రేలియా పోలీసులు వేట…
Virat Kohli: టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడేందుకు ఆదివారం నాడు పెర్త్‌లో బస చేసింది. అయితే అక్కడి హోటల్ గదిలో కోహ్లీ లేని సమయంలో ఓ వ్యక్తి వెళ్లి గదిలోని వస్తువులను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం కలకలం రేపింది. కోహ్లీ ధరించే దుస్తులు, కళ్లద్దాలు, టోపీలు, బూట్లు, ఇతర వస్తువులను ఈ వీడియోలో చూపించాడు. అయితే ఈ వీడియోపై స్పందించిన విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం నాడు బ్రిస్బేన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్ వార్నర్ తన ఫేలవ ఫామ్‌ను కొనసాగించాడు. అతడు మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్, కెప్టెన్…
Worst Record: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేస్తోంది. బాబర్ సేన వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయి విమర్శలను ఎదుర్కొంటోంది. టీమిండియాతో మ్యాచ్ పక్కన పెడితే జింబాబ్వే లాంటి జట్టుపైనా ఓడటం ఆ జట్టు మానసిక పరిస్థితిని బహిర్గతం చేస్తోంది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కూడా తమ జట్టుపై మాటల తూటాలతో పాటు సెటైర్లు పేలుస్తున్నారు. విచిత్రం ఏంటంటే.. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు పాకిస్థాన్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా నెగ్గలేదు.…
AUS Vs ENG: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే వరుణుడి వల్ల మూడు మ్యాచ్‌లు వాష్ అవుట్ కాగా శుక్రవారం వరుసగా రెండో మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలుత వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అవుతుందని అభిమానులు ఆశించారు. కానీ వర్షం తగ్గినా మైదానం పూర్తిగా తడిగా ఉండటంతో మ్యాచ్ నిర్వహించడం సాధ్యం…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే కరోనా కారణంగా స్పిన్ బౌలర్ ఆడమ్ జంపా శ్రీలంకతో మ్యాచ్‌కు దూరం కాగా ఇప్పుడు స్టార్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ కూడా కరోనా బారిన పడ్డాడు. బుధవారం సాయంత్రం మాథ్యూ వేడ్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు తదుపరి మ్యాచ్ ఆడటం అనుమానంగా మారింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 28న మెల్బోర్న్ వేదికగా ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా…
T20 World Cup: టీ20 ప్రపంచకప్ అంచనాలకు అందకుండా సాగుతోంది. ఇప్పటికే మెగా టోర్నీ నుంచి వెస్టిండీస్ లాంటి టీమ్ ఇంటి బాట పట్టింది. ఇప్పుడు సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు పరాభవం ఎదురైంది. సూపర్-12లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ 89 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 201 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను 111 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఆస్ట్రేలియా పతనానికి…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో అసలు సిసలు పోరు ఈరోజే ప్రారంభమైంది. సూపర్-12లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 201 పరుగులు భారీ టార్గెట్ నిలిచింది. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే 92 పరుగులతో తుదికంటా…