Suryakumar Yadav 4 Sixes Video Goes Viral: ‘సూర్యకుమార్ యాదవ్’.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్లోకి కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా.. తనదైన ఆటతో అభిమానులను అలరిస్తున్నాడు. మైదానం నలువైపులా షాట్లు కొడుతూ.. ‘మిస్టర్ 360’గా పేరు తెచ్చుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న సూర్య.. టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. పొట్టి ఫార్మట్‌లో దూకుడును వన్డేల్లో కూడా కొనసాగిస్తున్నాడు. ప్రపంచకప్ 2023కి ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న…
Cameron Green holds the Worst Record in ODI’s: ఇండోర్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఆసీస్ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ.. బౌండరీలు, సిక్సుల వర్షం కురిపించారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ (105; 90 బంతుల్లో 11×4, 3×6), శుభ్‌మన్ గిల్ (104; 97 బంతుల్లో 6×4, 4×6), సూర్యకుమార్ యాదవ్ (72 నాటౌట్; 37 బంతుల్లో 6×4, 6×6)ల దాటికి ఆస్ట్రేలియా బౌలర్లు చేతులెత్తేశారు. భారత…
ఇండోర్ లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ 99 పరుగుల తేడాతో గెలిచింది. 217 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. దీంతో 99 పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా 3 వికెట్లు, అశ్విన్ కు 3, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా.. షమీ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ గెలిచి భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది.
ఇండోర్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై టీమిండియా బ్యాట్స్మెన్లు సెంచరీల మోత మోగించారు. ఓపెనర్ గా బరిలోకి దిగిన శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ అద్భుత సెంచరీలు చేశారు. గిల్ 92 బంతుల్లో సెంచరీ పూర్తి చేయగా.. శ్రేయస్ అయ్యర్ 86 బంతుల్లో సెంచరీ సాధించాడు. అయితే వీరిద్దరి సెంచరీలతో ప్రపంచకప్‌పై మరింత ఉత్సాహాన్ని పెంచారు.
వన్డేలలో భారత్ అత్యధిక స్కోర్లు నమోదుచేసింది. ఇంతకుముందు టీమిండియా.. 2011లో వెస్టిండీస్ పై 418 పరుగులు చేసింది. 2009లో శ్రీలంకపై 414 పరుగులు, 2007లో బెరుమాడపై 413, 2002లో బంగ్లాదేశ్ పై 409, 2014లో శ్రీలంకపై 404, 2010లో సౌతాఫ్రికాపై 401 పరుగులు చేసింది. అయితే ఈరోజు జరిగే మ్యాచ్ లో మళ్లీ అత్యధిక పరుగుల దిశగా భారత్ దూసుకెళ్తుంది.
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు.. ప్రధాన మార్పులతో రెండో వన్డే ఆడనుంది. రేపు (ఆదివారం) ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.
టీమిండియా జట్టు మళ్లీ వన్డేల్లతో నెంబర్-1 ర్యాంక్ దక్కించుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో అద్భుతమైన గెలుపుతో టీమిండియా 116 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకుంది.
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ గెలుపొందింది. 277 టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా.. చివరకు ఆడి గెలిపించారు.
వన్డేలలో ఆడటానికి బౌలింగ్ ఒక్కటే సరిపోదని.. బ్యాటింగ్, ఫీల్డింగ్ కూడా ముఖ్యమని అమిత్ మిశ్రా అన్నాడు. అశ్విన్ మంచి బౌలర్, వికెట్లు తీయగల సామర్థ్యం కలిగి ఉన్నాడని చెప్పాడు. కానీ వన్డేల్లో కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడానికి తీసుకోరని.. 40 ఓవర్ల ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయాల్సి ఉంటుందని అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు.