స్టీవ్ స్మిత్ గీత దాటడానికి ముందు వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో వికెట్లను కొట్టినా... బెయిల్స్ కదిలే సమయానికి అతని బ్యాటు క్రీజు లోపలికి వచ్చిందని నిర్ధారణకు రావడంతో నాటౌట్‌గా ప్రకటించాడు. అంపైర్లు ఇంత క్లియర్‌గా చూస్తారా? అనే విషయం ఇప్పుడే నాకు తెలిసిందంటూ స్టువర్ట్ బ్రాడ్ కామెంట్స్ చేశాడు..
Australia retains Ashes 2023 vs England after 4th Test Drawn: ‘బజ్‌బాల్’ ఆటతో సొంతగడ్డపై యాషెస్ 2023ని గెలుచుకుందాం అనుకున్న ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి. నాలుగో టెస్టులో గెలిచి యాషెస్ సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకున్న ఇంగ్లండ్‌కు వరణుడు అడ్డుపడ్డాడు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా.. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్, ఆ్రస్టేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు ఐదో రోజు ఆట సాధ్యపడలేదు. దాంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగియగా.. ఇంగ్లండ్‌కు తీవ్ర నిరాశ మిగిలింది. బజ్‌బాల్…
Big Sea Snake washes up on Australia Sunshine Beach: ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌లోని సన్‌షైన్ బీచ్ నుంచి ఇటీవల అత్యంత విషపూరితమైన, భారీ సముద్రపు పాము కొట్టుకుపోయింది. ఈ విషయాన్ని సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. బీచ్‌లలో ఏదైనా సముద్రపు పాముని చూసినట్లయితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని.. దానిని పట్టుకోవడానికి కానీ, దగ్గరకు వెళ్లడానికి అస్సలు ప్రయత్నించొద్దని వారు హెచ్చరించారు. ఇందుకు సంబందించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్…
Australia state Victoria withdraws as host of 2026 Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్ 2026 ఆతిథ్యం నుంచి ఆస్ట్రేలియలోని విక్టోరియా స్టేట్ వైదొలిగింది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బడ్జెట్ తమ వల్ల కాదని మంగళవారం విక్టోరియా స్టేట్ తేల్చి చెప్పింది. గేమ్స్ నిర్వహణ నుంచి తాము తప్పుకుంటున్నట్లు కామన్వెల్త్ గేమ్స్ అథారిటీకి సమాచారం ఇచ్చామని, తమ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి వేరే వాళ్లకు…
సిడ్నీ నగరంలో మంగళవారం తనపై ఖలిస్థానీ వేర్పాటు వాదులు దాడి చేసినట్లు భారత్‌కు చెందిన ఓ విద్యార్థి తెలిపాడు. వెస్టర్న్ సిడ్నీలోని వెస్ట్‌మేడ్ ఏరియాలో దాదాపు 7, 8 మంది ఖలిస్థానీ మద్దతుదారులు తనను విచక్షణా రహితంగా కొట్టారని అతడు పేర్కొన్నాడు. తనపై దాడి చేస్తున్న.. సమయంలో ఆ మూక ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిందని చెప్పుకొచ్చాడు.
CRPS: కాలు కదిపినా నొప్పే, కాలికి ఏదైనా వస్తువు మామూలుగా తాకినా చచ్చేంద బాధ, చివకు ఎవరైనా పట్టుకున్నా కూడా చెప్పలేనంత బాధ అనుభవిస్తోంది ఆస్ట్రేలియాకు చెందిన ఓ పదేళ్ల బాలిక.
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్ ల్లో గెలిచిన ఆసీస్ మూడో టెస్టులో ఓటమిని చవిచూసింది. ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి ఇంగ్లండ్ తగ్గించింది. మరో రెండు టెస్టు మ్యాచులు మిగిలిన ఉన్న నేపథ్యంలో సిరీస్ గెలిచేందుకు ఇరు జట్లకు ఛాన్స్ ఉంది. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ టీమ్ మూడు వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (93 బంతుల్లో 9 ఫోర్లతో…
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఇక, ఇంగ్లీష్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు కుప్పకూలిపోయింది. బెన్ స్టోక్స్ (108 బంతుల్లో 80 పరుగులు) ఒంటరిగా పోరాటం చేశాడు. పాట్ కమిన్స్ ఆరు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ ని ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర వహించాడు. ఇక ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔటైన వివాదాన్ని ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఇప్పట్లో మరిచిపోయేలా కనిపించడం లేదు. తాజాగా మూడో టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి ఇంగ్లీష్ ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న లీడ్స్ మైదానం జానీ బెయిర్ స్టోకు హోమ్ గ్రౌండ్.. కాగా బెయిర్ స్టో ఇలాకాలో ఇంగ్లండ్ అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తించారు.
Australia: ఆస్ట్రేలియా లోని 21 ఏళ్ల భారతీయ నర్సింగ్ విద్యార్థిని జాస్మీన్ కౌర్ ను ఆమె మాజీ లవర్ దారుణంగా హత్య చేశాడు. 2021లో ఆమె లవర్ తారిక్‌జోత్ సింగ్ ఆమెను కిడ్నాప్ చేసి ప్రాణం ఉండగానే పూడ్చి పెట్టాడు. ప్రతీకారంతో తారిక్‌జోత్ సింగ్ యువతిని దారుణంగా హత్య చేసిన కేసును అక్కడి కోర్టు బుధవారం విచారించింది.