Australia: ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో వినాశకరమైన వర్షాలు సంభవించాయి. దీని తరువాత వరదలు సంభవించాయి.
Michael Vaughan Hails India Team after Pakistan Defeat vs Australia: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే. 360 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో చిత్తయింది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 487 పరుగులు చేయగా.. పాక్ 271 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 233/5 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా.. 450 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 89 పరుగులకే ఆలౌట్ అయింది.…
రాయ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 నాలుగో మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టీమిండియా ప్లేయర్లు సమష్టిగా రాణించడంతో.. ఆస్ట్రేలియాను 20 పరుగుల తేడాతో ఓడించింది యంగిస్థాన్. మరో మ్యాచ్ ఉండగానే.. 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇదే సమయంలో టీ 20ల్లో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది..
5 టీ20 సిరీస్ లో భాగంగా టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. నాలుగో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 20 పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.
రాయ్పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే భారత్.. 2-1 ఆధిక్యంలో ముందుంది. అయితే ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా ఆశిస్తోంది.
టీ20 క్రికెట్లో ఈరోజు టీమిండియా ఓ రికార్డు నెలకొల్పే సమయం వచ్చింది. ఈరోజు జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియాపై గెలిస్తే.. అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు గెలిచిన రేసులో పాకిస్తాన్ను వెనక్కి నెడుతుంది. ప్రస్తుతం ఇండియా-పాకిస్తాన్ సంయుక్తంగా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్, పాకిస్తాన్లు 135-135 మ్యాచ్ ల్లో గెలుపొందాయి. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ ను దాటి ముందడుగు వేసేందుకు ఈరోజు మంచి అవకాశం ఉంది. ఇప్పటి వరకు 226 టీ20 మ్యాచ్లు…
ఆస్ట్రేలియాతో 5 టీ20 సిరీస్ లో భాగంగా.. టీమిండియా మూడో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఇండియాపై ఆసీస్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోరులో ఆస్ట్రేలియానే విజయం…
భారత్-ఆస్ట్రేలియా మధ్య గౌహతిలోని బర్సపరా స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ కేవలం 6 పరుగులు చేసి ఔట్ కాగా.. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆసీస్ బౌలర్లకు ఊచకోత చూపించాడు. 57 బంతుల్లో (123) సెంచరీతో చెలరేగాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు…
ఐదు టీ20 సిరీస్ లో భాగంగా కాసేపట్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య 3 టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఆస్ట్రేలియాతో టీమిండియా 5 టీ20ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా.. ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఆ మ్యాచ్ ల్లో టీమిండియానే గెలుపొందింది. కంగారులపై యువ ఆటగాళ్లు చెలరేగడంతో 2-0తో భారత్ ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే.. చివరి రెండు టీ20 మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.