మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడు యాకూబ్ హబీబుద్దీన్.. ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్స్ కు లేఖ రాశారు. ఔరంగజేబులో సమాధికి రక్షణ కల్పించాలని వేడుకున్నారు.
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పర్యటనపై వివాదం అయిన తర్వాత మహారాష్ట్రలోని ఔరంగజేబు సమాధిని 5 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది భారత పురావస్తు శాఖ.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని ఇటీవల అక్బరుద్దీన్ ఒవైసీ సందర్శించడంపై మహారాష్ట్రలో భారీ వివాదం నెలకొంది.. ఈ నేపథ్యంలో స్మారక చిహ్నాన్ని పరిరక్షిస్తున్న భారత పురావస్తు శాఖ ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అంతకుముందే మసీదు కమిటీ ఆ స్థలాన్ని తాళం వేయడానికి…