Diamond Auction : సూరత్ అంటే వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరు అనే విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనుల నుంచి వెలికితీసిన డైమండ్లకు నిర్వహించిన ఈ–వేలంలో గుజరాత్ లోని సూరత్, ముంబై, పన్నా ప్రాంతాల్లోని వర్తకులు పాల్గొంటారు.
Chiken Auction : సాధారణంగా ఎలాంటి కోడి ధర అయినా మా అంటే కేజీకి రూ.1000దాటదు. కానీ కేరళ రాష్ట్రంలోని ఇర్తి సమీపంలో ఉన్న పెరుంబరంలో ఓ కోడి ధర రూ.34వేలు పలికింది.
రాజధాని అభివృద్ధి నిధుల సేకరణకు అమరావతిలోని భూములను విక్రయించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో 248.34 ఎకరాలను అమ్మాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. కనీస ధర ఎకరాకు రూ.10 కోట్లుగా నిర్ధారించింది. ఈ మేరకు వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతిస్తూ 389 జీవోను ప్రభుత్వం జారీ చేసింది. భూముల విక్రయం ద్వారా ఎకరాకు రూ.10 కోట్ల చొప్పున రూ.2,480 కోట్లను ప్రభుత్వం సేకరించనుంది. గతంలో బీఆర్ శెట్టి మెడిసిటీ కోసం కేటాయించిన 100 ఎకరాలు, లండన్…
నోబెల్ ప్రైజ్.. ప్రపంచంలోనే అత్యంత గౌరవాన్ని, కీర్తిని తెచ్చిపెట్టే బహుమతి. వివిధ రంగాల్లో ఉద్దండులకు మాత్రమే ఈ అవార్డును ఇస్తారు. అలాంటిది ఓ రష్యా జర్నలిస్టు ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన పిల్లలకు ప్రయోజనం చేకూర్చడానికి రష్యా జర్నలిస్టు దిమిత్రి మురతోవ్ నోబెల్ శాంతి బహుమతిని సోమవారం వేలం వేశారు. ఈ వేలంలో నోబెల్ శాంతి బహుమతి సుమారు 800 కోట్ల(103.5మిలియన్ డాలర్లు)కు అమ్ముడుపోయింది. మురాతోవ్ 2021లో ఫిలిప్పీన్స్‌కు చెందిన జర్నలిస్ట్…
మనం భోజనం తినాలంటే ఫ్రెండ్స్ వుంటే చాలు, లేదా కుటుంబంతో హ్యాపీగా మాట్లాడుతూ ఆనందంగా తినేస్తాం. మనతో వున్న పై అధికారులు కూడా మనతో భోజనం చేస్తే ఆ.. ఆనందమే వేరు. అంత పెద్ద స్థాయిలో వున్నా మనతో కలిసిపోయి ఎంత కలివిడిగా భోజనం చేసారో అంటూ చెప్పుకుంటాం. కానీ ప్రపంచ బిలియనీర్లలో ఒకరు. ఈయనతో కలిసి భోజనం చేయాలంటే రూ.కోట్లలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆయన ఎవరో కాదు వారెన్ బఫెట్. దిగ్గజ ఇన్వెస్టర్. బర్క్‌షైర్ హాత్‌వే…
2020 లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా చాలా మంది కూలీలు తమ స్వస్థలాలకు తరలివెళ్లిపోయారు. ఆ సమయంలో సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. దీంతో వలస కూలీలు కాలి నడకన లేదా సైకిళ్ల మీద సొంతూళ్లకు వెళ్లారు. యూపీలో కొందరు వలస కూలీలు తమ సైకిళ్లను సహరణ్ పూర్‌లో వదిలి వెళ్లారు. ఎందుకంటే సహరణ్ పూర్ జిల్లా కేంద్రం అనేక రాష్ట్రాలకు మెయిన్ సెంటర్‌గా ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో కూలీలు భారీ ఎత్తున సైకిళ్లు వదిలివెళ్లారు.…
బూడిద అంటే గతంలో అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు బూడిద అక్రమార్కుల పాలిట కామధేనువుగా మారింది. ప్రజాప్రతినిధులు మాఫియాగా ఏర్పడి వందల లారీల ద్వారా కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. రోజుకి లక్షల రూపాయల ఎన్టీపీసీ యాజమాన్యం సొమ్మును కొట్టేస్తున్నారు. రోజువారీ ఎవరి వాటా వారికి అప్పగిస్తూ తమ పని కానిచ్చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ బొగ్గు ఆధారిత ప్రాజెక్టులో బొగ్గును మండించిన తర్వాత వచ్చే బూడిద యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది.కుందనపల్లి గ్రామం వద్ద 1700…
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ తాజా నిర్ణయం ఒకటి విమర్శల పాలవుతోంది. పన్నులు కట్టనివారిపై మునిసిపల్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై జనం మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో కమిషనర్ వివరణ ఇచ్చారు. ఇళ్లలో సామాన్లు జప్తు వాహనాలపై కాకినాడ కమిషనర్ వివరణ ఇచ్చారు. నిన్న ప్రారంభించిన జప్తు వాహనాలను నిలిపివేశామన్నారు. సకాలంలో పన్నులు కట్టకపోతే ఇళ్లు జప్తు చేయడం ఎన్నో ఏళ్లుగా ఉందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు జప్తు వాహనాలను ఏర్పాటు చేశామని, ప్రస్తుతం జప్తు వాహనాలు నిలిపివేశామని…
కొన్ని ఇల్లు భలే కలిసి వస్తుంటాయి. కొన్ని ఇల్లు మాత్రం అస్సలు ఎవరికీ కలిసిరావు. ఇంటిని ఇష్టపడి కట్టుకున్నా, కొనుక్కున్నా ఆ ఇంట్లో నివశించే వారికి ఎప్పుడూ తెలియని ఇబ్బందులు ఎదురౌతుంటాయి. అప్పులు, జబ్బులతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని నోయి వ్యాలీలో 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ ఇల్లు ఉన్నది. సుమారు 122 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఇంటి చుట్టూ పెద్ద పెద్ద ఇళ్లు, లగ్జరీ ఇళ్లు ఉన్నాయి. కానీ,…