మనం భోజనం తినాలంటే ఫ్రెండ్స్ వుంటే చాలు, లేదా కుటుంబంతో హ్యాపీగా మాట్లాడుతూ ఆనందంగా తినేస్తాం. మనతో వున్న పై అధికారులు కూడా మనతో భోజనం చేస్తే ఆ.. ఆనందమే వేరు. అంత పెద్ద స్థాయిలో వున్నా మనతో కలిసిపోయి ఎంత కలివిడిగా భోజనం చేసారో అంటూ చెప్పుకుంటాం.
కానీ ప్రపంచ బిలియనీర్లలో ఒకరు. ఈయనతో కలిసి భోజనం చేయాలంటే రూ.కోట్లలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆయన ఎవరో కాదు వారెన్ బఫెట్. దిగ్గజ ఇన్వెస్టర్. బర్క్‌షైర్ హాత్‌వే చైర్మన్. ఈయనతో కలిసి భోజనం చేయడానికి ప్రతి ఏటా వేలం నిర్వహిస్తారు. గత రెండేళ్ల నుంచి వేలం లేదు. కరోనా వైరస్ ఇందుకు కారణం. ఈసారి వేలం నిర్వహించారు. ఈ వేలంలో బిడ్ రేటు 19 మిలియన్ డాలర్లకు చేరింది.
వారెన్ బఫెట్ పేరు తెలియని వారు ఉండరని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో. చాలా మందికి ఈయన తెలుసు. ప్రపంచ కుబేరుల్లో ఈయన కూడా ఒకటి. ప్రపంచంలోనే దిగ్గజ ఇన్వెస్టర్లలో ఒకరు. బర్క్‌షైర్ హాత్‌వే చైర్మన్ అయిన ఈయన ఎప్పటికప్పుడు అత్యంత ఖరీదైన లంచ్ గెస్ట్‌లలో తన వారసత్వాన్ని మరోసారి సుస్థిరం చేసుకున్నారు.
ఈ బిలియనీర్ ఇన్వెస్టర్‌తో కలిసి భోజనం చేయడానికి ప్రతి ఏటా వేలం నిర్వహిస్తారు. ఈసారి వేలంలో దీని కోసం ఏకంగా 19 మిలియన్ డాలర్ల బిడ్ లభించింది. ఇబే లిస్టింగ్ ప్రకారం.. ఒక వ్యక్తి వారెన్ బఫెన్‌తో కలిసి భోజనం చేయడానికి ఏకంగా 19 మిలియన్ డాలర్లు చెల్లించడానికి రెడీ అయ్యాడు. మన కరెన్సీలో చెప్పుకుంటే దీని విలువ దాదాపు రూ. 148 కోట్లకు పైమాటే అన్నమాట.
Viral Video: సైకిల్‌పై నుంచి కిందపడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్