Marriage: సోనమ్ రఘువంశీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భర్త రాజా రఘువంశీని హనీమూన్ పేరుతో మేఘాలయా తీసుకెళ్లి, కిరాయి హంతకులతో హత్య చేయించింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ప్లాన్ చేసి ఘాతుకానికి తెగబడింది. అయితే, ఒక్క సోనమ్ ఘటనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సంఘటనలతో యువకులు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకువచ్చింది.
Wife harassment: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. భార్య, ఆమె తల్లిదండ్రుల వేధింపుల కారణంగా సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. గంటన్నర నిడివి ఉన్న వీడియో రికార్డ్ చేసి తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పాడు. అయితే, తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే యూపీ ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. భార్య, ఆమె తరుపు బంధువుల వేధింపులకు 34 ఏళ్ల వ్యక్తి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Marital Dispute: 40 ఏళ్ల టెక్ ప్రొఫెషనల్ ఆదివారం బెంగళూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ప్రశాంత్ నాయర్‌గా గుర్తించారు. వైవాహిక వివాదం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. మృతుడు లెనోవా లో సీనియర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
Husband Suicide: భార్య, భార్య తరుపు బంధువల వేధింపులకు భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ వ్యవహారం కూడా ఈ కోవకు చెందినదే. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచింది. ఇది జరిగిన తర్వాత, మరికొందరు కూడా తమ భార్యల వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
Dinesh Sharma: గృహ హింస, మహిళలపై దోపిడీ చట్టాలను దుర్వినియోగం చేయడంపై గత కొంత కాలంగా దేశంలో చర్చ నడుస్తోంది. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతడి భార్య తప్పుడు గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెట్టిన కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. దీంతో ఇలా చట్టాలను దుర్వినియోగం చేసే…
Gujarat: భార్యల వేధింపులకు భర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్, ఢిల్లీ కేఫ్ ఓనర్ పునీత్ ఖురానా ఘటనలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. భార్యలు వేధించడంతో తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీరిద్దరు వీడియో రికార్డ్ చేసి మరణించారు. తాజాగా గుజరాత్‌లో ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. భార్య వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Read Also: Bird flu: “బర్డ్ ఫ్లూ”తో 3 పులులు, ఒక చిరుత మృతి..…
Atul Subhash Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసులో కీలక పరిణామం జరిగింది. సుభాష్ ఆత్మహత్యకు కారణమైన భార్య నిఖితా సింఘానియా, ఆమె తల్లి నిషా సింఘానియా, సోదరుడు అనురాగ్ సింఘానియాకు బెయిల్ లభించింది. ఈ కేసులో బెయిల్ కోసం బెంగళూర్ సెషన్స్ కోర్టుని ఆశ్రయించారు. తమ బెయిల్ పిటిషన్‌ని పరిష్కరించేలా సెషన్ కోర్టుని ఆశ్రయించాలని వీరు గతంలో కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు.
Atul Subhash Case: భార్య తప్పుడు కేసులతో వేధింపులకు గురైన బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ కేసులో ఇప్పటికే సుభాష్ భార్య నిఖితా సింఘానియాతో పాటు ఆమె తల్లి, సోదరుడిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో భార్య నికితా సింఘానియా, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. భార్య నికితను గురుగ్రామ్‌లో అరెస్టు చేయగా, తల్లి, సోదరుడిని ప్రయాగ్‌రాజ్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కొన్ని రోజుల క్రితం నికితా, ఆమె కుటుంబం వేధింపులకు బరిచలేక ఆరోపిస్తూ.. టెకీ ఆత్మహ్య చేసుకున్న విషయం తెలిసిందే.
Atul Subhash Case: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తప్పుడు వరకట్న వేధింపులు, గృహ హింస చట్టాలు సెక్షన్ 498-ఏ ని సమీక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు భర్త, అతడి ఫ్యామిలీని వేధించేందుకు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెబుతున్నారు. అతుల్ సుభాష్ ఆత్మహత్య తర్వాత, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఈ డిమాండ్ వస్తోంది. ఆయనకు న్యాయం చేయాలని,