Bengaluru: భార్య, ఆమె కుటుంబం వేధింపుల భరించేలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అక్రమ వరకట్న వేధింపుల కారణంగా తాను చనిపోతున్నట్లు సుభాష్ 24 పేజీల లేఖ, గంటలకు పైగా వీడియోను రికార్డ్ చేసి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వరకట్న, గృహహింస సెక్షన్ 498ఏని సమీక్షించాలని పలువురు కోరుతున్నారు.
Bengaluru Techie Suicide: బెంగుళూర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఉదంతం దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. భార్య, ఆమె కుటుంబ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో భార్య నికితా సింఘానియా కుటుంబంపై సమాజం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.