Wife harassment: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. భార్య, ఆమె తల్లిదండ్రుల వేధింపుల కారణంగా సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. గంటన్నర నిడివి ఉన్న వీడియో రికార్డ్ చేసి తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పాడు. అయితే, తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే యూపీ ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. భార్య, ఆమె తరుపు బంధువుల వేధింపులకు 34 ఏళ్ల వ్యక్తి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఘజియాబాద్‌లోని మోడీనగర్ ప్రాంతానికి చెందిన మోహిత్ త్యాగి అనే ప్రైవేట్ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. మోహిత్ సోదరుడు రాహుల్ త్యాగి, మోహిత్ భార్య భార్య ప్రియాంకా, ఆమె సోదరుడు పునీత్ త్యాగి, వదిన నీతు త్యాగి, మామలు అనిల్, విశేష్ త్యాగిల వేధింపుల కారణంగానే తన సోదరుడు మరణించాడని ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 10, 2020లో ప్రియాంకా అనే మహిళను మోహిత్ వివాహం చేసుకున్నాడు. ఇది మోహిత్‌కి రెండో వివాహం. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లయిన కొన్ని నెలల తర్వాత నుంచే వీరి మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి.
Read Also: Maharashtra: ‘‘హిందీ వివాదం’’.. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ కలిసే అవకాశం..
2024లో మోహిత్ తల్లి బ్లడ్ క్యాన్సర్‌తో మరణించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. తల్లి మరణించిన మూడు నెలల తర్వాత ప్రియాంకా, తన సోదరుడు, మరో వ్యక్తి సాయంతో ఇంట్లో ఉన్న ఆభరణాలు, లాకర్లో ఉన్న నగదును తీసుకుని వెళ్లిపోయింది. మోహిత్ ఉద్యోగానికి వెళ్లిన తర్వాత ఇది జరిగింది. సంఘటన జరుగుతున్న సమయంలో వీరిని మోహిత్ అన్న రాహుల్, అతడి భార్య ఆపేందుకు ప్రయత్నిస్తే, వీరిని కూడా బెదిరించి ఇంట్లో నుంచి ప్రియాంకా వెళ్లిపోయింది. ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదని తెలుస్తోంది.
ఏప్రిల్ 15న మోహిత్‌కి సంభాల్‌లోని చౌడా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. అతడి భార్య కేసు పెట్టినట్లు చెప్పారు. ఇది జరిగిన తర్వాత మోహిత్ తన సన్నిహితులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి, తాను చనిపోతున్నట్లు చెప్పారు. తాను తన భార్య ప్రియాంకాని మార్చడానికి చాలా ప్రయత్నించానని, ఆమె ప్రవర్తన కారణంగానే తాను చనిపోతున్నట్లు మోహిత్ పేర్కొన్నాడు. విషం తాగిన మోహిత్‌ని స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. రెండు రోజుల తర్వాత చికిత్స పొందుతూ మరణించాడు. ప్రియాంకా తన కుటుంబం నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడానికి, తప్పుడు కేసుల్లో ఇరికించారని మోహిత్ ఆత్మహత్యకు ముందు ఆరోపించా3డు. వివాహ వివాదాలలో చట్టపరమైన నిబంధనల దుర్వినియోగాన్ని అరికట్టాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూసైడ్ లేఖలో కోరారు..