ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడికిహైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అచ్చెన్నాయుడిపై ముందస్తు చర్యలు వద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.
చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబుని అరెస్ట్ చేసి సీఎం జగన్ రెడ్డి భయపడడం సిగ్గుచేటు.. చంద్రబాబుకి దేశ వ్యాప్తంగా వస్తున్న మద్దతు చూసి జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలయింది..
టీడీపీ మహానాడు వేదికపై వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ చేపడుతున్న బస్సు యాత్రలో వస్తోంది మంత్రులు కాదని.. అలీబాబా 40 దొంగలు అని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. వైసీపీ మంత్రులను ప్రజలు నిలదీయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలదే అధికారం అని తెలిపారు. ఇబ్బంది పెట్టిన వారిని కార్యకర్తలతోనే శిక్షలు విధించేలా న్యాయబద్దమైన, చట్టబద్దమైన అధికారాలు…
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీలో జోష్ తేవాలని చంద్రబాబు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఈనెల 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లాలో జరిగే మహానాడును ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మహానాడులో ముఖ్యంగా 15 తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తీర్మానాలపై ఇప్పటికే టీడీపీ అగ్రనేతలు కసరత్తులు పూర్తి చేసినట్లు సమాచారం. అయితే రాజకీయ తీర్మానాలకు సంబంధించి ఏయే అంశాలు ప్రస్తావించనున్నారనే అంశంపై అందరి దృష్టి పడింది. ఈ తీర్మానాల ద్వారా వచ్చే ఎన్నికల్లో…
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు నిద్రపట్టక పిచ్చివాగుడు వాగుతున్నారని.. దుర్మార్గులను బంగాళాఖాతంలో కలపాలంటే చంద్రబాబు పొత్తుల గుర్చి మాట్లాడుతున్నారని ఆరోపించడం దారుణమన్నారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన విజయవంతమైందన్నారు. చంద్రబాబు పర్యటన విజయవంతం కావడంతో జగన్, వైసీపీ నేతలకు కింద తడవడం ప్రారంభమైందని విమర్శించారు. చంద్రబాబుకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి వైసీపీకి వెన్నులో వణుకు…
ఇటీవల పల్నాడు జిల్లా దాచేపల్లిలో టీడీపీ కార్యకర్త కనిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ నేతలు చేసిన దాడిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికార బలంలో వైసీపీ అరాచకాలు, ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోందని ఆగ్రహించారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చిన ఆయన.. దాడికి పాల్పడిన మున్సిపల్ ఛైర్‌పర్సన్ రమాదేవి భర్త, కుమారులు, బంధువులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం…
మేడే సందర్భంగా విజయవాడలో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోండా ఉమ, గద్దె రామ్మోహనం, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ.. మూడేళ్ల జగన్ పాలనలో ఒక కార్మికుడు చనిపోయినా రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. కార్మికులు దాచుకున్న డబ్బులను కూడా జగన్ సర్కార్ తినేసిందని విమర్శించారు. ఏపీలో మళ్లీ…
ఏపీలో పాఠశాలలకు మే 6 నుంచి జూలై 3 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సెలవులు టీచర్లకు వర్తించవు అని.. మే 20 వరకు టీచర్లు పాఠశాలలకు రావాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా స్పందించారు. టీచర్లకు సెలవులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని విద్యాశాఖ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. టీచర్లకు సెలవులు వేసవి కాలంలో కాకుండా వర్షాకాలంలో ఇస్తారా అంటూ ఎద్దేవా…