వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్లీనరీ వేడుకలు గుంటూరు వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. అయితే దీనిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్లీనరీ కాదు డ్రామా గ్యాలరీ అంటూ విమర్శించారు. ప్లీనరీ పేరుతో జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, 2 రోజుల ప్లీనరీ – ఆర్టీసీకి రూ.10 కోట్లు నష్టమన్నారు. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉందని 3 సార్లు చార్జీలు పెంచారని, ప్రతిపక్ష పార్టీల సభలకు అడ్డంకులు సృష్టించే ప్రభుత్వం నేడు వైసీపీ ప్లీనరీకి మాత్రం మర్యాదలు చేస్తున్నారన్నారు. అధికారపక్షానికి ఒక న్యాయం ప్రతిపక్షానికి మరొక న్యాయమా..? అని ఆయన ప్రశ్నించారు.
YSRCP Plenary : భారీగా ట్రాఫిక్ జాం.. కాలినడకన ప్లీనరీకి
తెలుగుదేశం పార్టీ మహానాడు ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఇవ్వలేదని, రాజధాని రైతుల పాదయాత్రకు అనుమతివ్వలేదని, ప్లీనరీకి మాత్రం రెడ్ కార్పెట్ వేసి మరి సేవలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా నాగార్జున యూనివర్సిటీకి సెలవులిచ్చారని, స్కూల్ బస్సులు, ప్రైవేట్ వాహనాలను బలవంతంగా లాక్కుంటున్నారని, డ్వాక్రా మహిళలను బెదిరించి ప్లీనరీకి తరలిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇష్టానుసారంగా హైవేపై ఫ్లెక్సీల ఏర్పాటుతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.