శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ అసెంబ్లీ ప్లీనరీ సమావేశం ఘనంగా నిర్వహించారు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ముందుగా ధర్మవరం మండలంలోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో వెళ్లి ధర్మవరం పట్టణంలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో ప్లీనరీ సమావేశం నిర్వహించారు.ప్రతిపక్ష నాయకులపై రెచ్చిపోయారు వైసీపీ నేతలు. ప్లీనరీ సమావేశానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ధర్మవరం మున్సిపల్ చైర్మన్ నిర్మల హాజరయ్యారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ…జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా న్యాయం చేస్తుంటే అది చూసి ఓర్వలేని తెలుగుదేశం పార్టీలో ఉన్న తాగుబోతు నాయకుడు అయ్యన్నపాత్రుడు దున్నపోతులా ఉండే అచ్చెనాయుడు విమర్శలు చేస్తున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్యం, అనేక సంక్షేమ పథకాలు.. ప్రతి పేదవారికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై నోరు జారితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు సరైన బుద్ధి చెప్తారన్నారు.
ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ..14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఏమేరకు అభివృద్ధి చేశాడన్నారు. జగన్ మూడేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చూసి ఓర్వలేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ తో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ఉంచుతున్న కాబట్టే ప్రజలు నాకు ఓటేసి నన్ను ఆశీర్వదించారు. బ బీజేపీ. జనసేన,వామపక్షాలు అన్నీ కలసికట్టుగా వచ్చినా ధర్మవరం నియోజకవర్గంలో ఈసారి కూడా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమని తెలిపారు. ఆది సినిమాలో అస్సాం పార్శిల్ ఎలా చేసాడో నేను ధర్మవరం ఎమ్మెల్యేగా గెలవగానే రెండు నెలలకి ఓడిన వ్యక్తి అస్సాం పార్సల్ అయ్యాడన్నారు. అలాంటి వాడు నా గురించి తప్పుడు మాటలు మాట్లాడడం సరి కాదని తెలిపారు. రాజకీయంగా ధర్మవరంలో ఎవరు వచ్చినా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని ఓడించలేరని బహిరంగ సవాల్ విసిరారు.
Bhatti Vikramarka : అగ్నిపథ్‌ను తక్షణమే విరమించుకోవాలి