ఏపీలో ఇంకా ఎన్నికలు రాకుండానే అధికార పార్టీ వైసీపీ తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అసెంబ్లీని క్వీన్ స్వీప్ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ తో సహా మంత్రులంతా పూర్తి ధీమాతో వున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆర్ కె రోజా. రాబోయే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు మావే అన్నారు రోజా. లంబసింగి వెళుతూ నర్సీపట్నంలో రాయల్ పార్క్ రిసార్ట్స్ లో మీడియాతో మాట్లాడారు పర్యాటక మంత్రి రోజా. సంక్షేమ పథకాలు, వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలను రద్దు చేసేస్తామన్న టిడిపి ఇప్పుడు మాటను మార్చిందన్నారు.
Read Also: India vs Bangladesh: చిట్టగాంగ్ టెస్టులో భారత్ ఘన విజయం..
జగన్ వల్ల రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు విశ్వసించారు.. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం పలు సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారు. కోవిడ్ అనంతరం పర్యాటకం పుంజుకుందన్నారు. యూత్ ఫెస్టివల్ నిర్వహణ వల్ల యువకుల్లో ప్రతిభ బయటకు వస్తుంది. ప్రకృతి అందాలు దెబ్బ తినకుండా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నాం. టెంపుల్ టూరిజం లో దేశంలోనే ఏపీ మూడో స్థానం సాధించిందన్నారు మంత్రి రోజా. ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రాంతాల్లో మరిన్ని వసతులు కల్పిస్తామన్నారు. స్వదేశీ దర్శన్, ప్రసాద స్కీమ్ లో ఉమ్మడి విశాఖకు నాలుగు ప్రాజెక్టులు మంజూరయ్యాయని మంత్రి రోజా వెల్లడించారు.
Read Also: Fraud Lady Arrest: సోషల్ మీడియాలో యువకులే టార్గెట్.. కిలాడీ లేడీ అరెస్ట్