బాల్య వివాహాల ఆరోపణలపై అరెస్టయిన దాదాపు 1000 మందికి ఇంకా బెయిల్ రాలేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బుధవారం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాలను రాష్ట్రం నుండి తొలగిస్తుందని సీఎం అసెంబ్లీలో వెల్లడించారు.
Assam: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందుతుండటంతో అస్సాం ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్లు, పందుల రవాణాపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది అస్సాం. అస్సాం పశుసంవర్ధక మరియు పశువైద్య శాఖ మంత్రి అతుల్ బోరా శనివారం మాట్లాడుతూ..అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కోళ్లు, పందులలో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
పాకిస్థాన్ ఏజెంట్లకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై అస్సాంలోని నాగావ్, మోరిగావ్ జిల్లాలకు చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
Cruel Woman: అసోంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిల తన ప్రియుడితో కలిసి భర్త, అత్తలను హత్య చేసింది. ఆపై వారి మృతదేహాలను ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్లలో పెట్టి కాల్వలో పడేసింది.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూలన చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు.
Crackdown On Child Marriage: అస్సాంలో బాల్యా వివాహాలపై అక్కడి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. బాల్యవివాహాల అణిచివేతలో భాగంగా శనివారం వరకు రాష్ట్రంలో 2,250 మంది అరెస్ట్ చేసింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్ 2026 అస్సాం ఎన్నికల వరకు కొనసాగుతుందని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,074 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి.
Owaisi slams Assam's child marriage crackdown: అస్సాం ప్రభుత్వం బాల్యవివాహాలపై ఉక్కుపాదం మోపుతోంది. సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బాల్య వివాహాలకు పాల్పడిన వారిని వరసగా అరెస్ట్ చేస్తోంది. అయితే ఈ వ్యవహారంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
అసోం ప్రభుత్వం బాల్య వివాహాలపై పెద్దఎత్తున అణచివేత ప్రారంభించడంతో తమ భర్తలు, కుమారులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
అసోంలో నేటి నుంచి బాల్య వివాహాలపై భారీ అణచివేతను ప్రారంభించనుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. బాల్య వివాహాలపై అసోం ప్రభుత్వం శుక్రవారం నుంచి భారీ అణిచివేత, నేరస్థులను అరెస్టు చేయడంతోపాటు విస్తృతమైన అవగాహన ప్రచారాన్ని చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.