“Who Stops Us From Correcting ‘Distortions’ In History Now?” Amit Shah: భారత చరిత్రను తిరగరాయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చరిత్రకారులను కోరారు. వారి చేసే ప్రయత్నాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. నేను చరిత్ర విద్యార్థిని అని.. చరిత్రను సరిగ్గా రాయలేదని, వక్రీకరించబడిందని నేను చాలా సార్లు విన్నానని.. బహుశా అదే నిజం కావచ్చు అని.. దీన్ని మనం సరిదిద్దాలని కోరారు. అస్సాంకు చెందిన 17వ శతాబ్ధపు అహెమ్ జనరల్ లచిత్ బర్ఫుకాన్ 400వ జన్మదిన కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Bengaluru Crime: ప్రియురాలితో శృంగారం చేస్తూ వ్యాపారవేత్త మృతి..
చరిత్రను సక్రమంగా, అద్భుత రీతిలో రాయకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారని ప్రశ్నించారు. ఇప్పుడు ఉన్న చరిత్రను పక్కన పెట్టి.. 150 ఏళ్లు పాలించిన 30 రాజవంశాలు, 300 మంది స్వాతంత్య్ర సమరయోధుల గురించి పరిశోధన చేయాల్సిందిగా విద్యార్థులను, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లను కోరారు. ఒక్కసారి నిజాలు రాస్తే తప్పుడు చరిత్ర అంతా కనుమరుగు అవుతుందని ఆయన అన్నారు. చరిత్రకారులకు కేంద్రం మద్దతు ఇస్తుందని వెల్లడించారు. ప్రజల ప్రయోజనం కోసం చరిత్రను పున:సమీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. మొఘలుల విస్తరణను అడ్డుకున్న లచిత్ పోరాటాన్ని అమిత్ షా కొనియాడారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ సరిఘాట్ యుద్ధంలో మొఘలులను ఓడించారని అమిత్ షా అన్నారు.
ఈ సందర్భంగా లచిత్ పై రూపొందించిన డాక్యుమెంటరీని అమిత్ షా ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్రమోదీ కృషి వల్ల నేడు ఈశాన్య రాష్ట్రాలు, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలపై అంతరం తగ్గిందని అన్నారు. ప్రభుత్వ కృషి వల్లే ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొందని అమిత్ షా అన్నారు. లచిత్ బర్ఫుకాన్ పుస్తకాన్ని కనీసం 10 భాషల్లోకి అనువదించాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అమిత్ షాని కోరారు. లచిత్ పరాక్రమం దేశప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు.