IIT Faculty: అస్సాంలోని నార్త్ గౌహతి ప్రాంతంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెసిడెన్షియల్ క్వార్టర్‌లో ఐఐటీ గౌహతి ప్రొఫెసర్ ఒకరు శవమై కనిపించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. మృతుడు గణిత విభాగంలో అధ్యాపకుడు, 47 ఏళ్ల డాక్టర్ సమీర్ కమల్‌గా గుర్తించారు. శుక్రవారం సాయంత్రం ఐఐటీ గౌహతి క్వార్టర్స్‌లోని ఒక గదిలోంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కమ్రూప్ జిల్లా ఎస్పీ హితేష్ రాయ్ తెలిపారు. రెండు-మూడు రోజుల క్రితమే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తాము అనుమానిస్తున్నామని.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి పంపారని ఆయన చెప్పారు.
Traffic Challan: ఇది ఉంటే మీరు సేఫ్.. ట్రాఫిక్ పోలీసులు అస్సలు చలానా వేయలేరు
తాళం వేసి ఉన్న ప్రొఫెసర్ క్వార్టర్స్ నుంచి దుర్వాసన వస్తోందని ఐఐటీ గౌహతి నుంచి శుక్రవారం సమాచారం అందిందని పోలీసులు వెల్లడించారు. అనంతరం జిల్లా మేజిస్ట్రేట్ సమక్షంలో తలుపు తెరిచామని ఎస్పీ వెల్లడించారు. క్వార్టర్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు కమల్ ఉరివేసుకుని మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఐఐటీ గౌహతి కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. మరణించిన ప్రొఫెసర్ కుటుంబానికి ఈ విషయాన్ని తెలియజేసింది. ప్రొఫెసర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. తాము పోలీసు విచారణకు సహకరిస్తామని, కమిషన్ కూడా వేస్తామని ఐఐటీ గౌహతి ప్రకటించింది. ఈ విషయంపై అంతర్గత విచారణ చేపడతామని ప్రకటించింది.