సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతున్నారు.
Himanta Biswa Sarma: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని కేంద్రం అమలులోకి తీసుకువచ్చింది. ప్రతిపక్షాలు ఈ చట్టాన్ని విమర్శిస్తున్నప్పటికీ బీజేపీ నేతృత్వంలోని కేంద్రం చట్టం అమలుకు మొగ్గుచూపింది. అయితే, ఈ చట్టంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి)కి దరఖాస్తు చేసుకోని వ్యక్తికి పౌరసత్వం లభిస్తే తాను రాజీనామా చేసే మొదటి వ్యక్తి తానేనని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం అన్నారు. సీఏఏ అమలుపై…
Himanta Biswa Sarma: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ.. అతను హిందువు కాదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లాలూ తీరును ఎండగట్టారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనకు తెలిసిన హిందూ సంస్కృతిని మరిచిపోయాడని ఎద్దేవా చేశారు. ఇంతకాలం హిందూ వ్యతిరేకిగా ఉండటమే అందుకు కారణం కావచ్చని అన్నారు. అస్సాంలోని బొంగైగావ్‌లో మంగళవారం…
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీలోని కీలక నేతలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రాజీనామా చేసి బీజేపీకి గూటికి చేరిపోయారు.
ముస్లిం వివాహాలు, విడాకుల చట్టాన్ని రద్దు చేసేందుకు అస్సాం ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇక, అస్సాం ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రంలో విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
Assam: అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం వివాహ చట్టాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం అతిపెద్ద చర్చకు దారి తీసింది. ఇది రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలుకు ముందడుగుగా పరిగణించబడుతోంది.
Amritpal Singh: ఖలిస్తానీ నేత, వివాదాస్పద వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్పాల్ సింగ్, అతని అనుచరులు అస్సాంలోని అత్యంత భద్రత కలిగిన జైలులో ఉన్నారు. అస్సాంలోని దిబ్రూగఢ్ సెంట్రల్ జైలో భారీ భద్రత కలిగిన జైలులో భద్రత ఉల్లంఘన వెలుగులోకి వచ్చింది. వేర్పాటువాద నేత, అతని 9 మంది సహచరులు ఉన్న సెల్ నుంచి స్పై కెమెరాలు, స్మార్ట్ ఫోన్, కీప్యాడ్ ఫోన్, పెన్ డ్రైవ్స్, బ్లూటూత్ హెడ్ ఫోన్స్, స్పీకర్లు, స్మార్ట్ వాచ్…