Frogs Wedding: వరుణుడి కటాక్షం కోసం డప్పు చప్పుళ్లతో జోరుగా కప్పల పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Frogs Wedding: ప్రకృతి దేవతలను ప్రసన్నం చేసుకోవాలంటే కప్పలకు పెళ్లి చేయడం, విందు భోజనం ఏర్పాటు చేయడం లాంటివి చేస్తారు. ఇక, వర్షాల కోసం వరుణయాగం, కబడ్డీ ఆటలు, పాటలు పాడటం చేస్తారు. తాజాగా అస్సాంలోని బిస్వనాథ్ జిల్లాలో ఆదర్శ గోరెహగి గ్రామంలోని స్థానికులు వరుణ దేవుడి కటాక్షాన్ని పొందడానికి పురాతన మార్గాలను ఆశ్రయించారు. డప్పు చప్పుళ్లతో జోరుగా కప్పల పెళ్లి చేసి వానలు కురిపించాలని వరుణ దేవుడిని ప్రార్థించారు. ‘భేకులి బియా’ అని కూడా పిలువబడే ఈ వేడుకలో గ్రామస్థులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వారి కరువు పీడిత భూములకు ఉపశమనం కలిగించాలని ప్రార్థించారు. కరువుతో సతమతమవుతున్న రైతులు చాలా కాలం నుంచి వర్షాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Also: Barsana Temple: ముందస్తు హోలీ వేడుకల్లో అపశ్రుతి.. రైలింగ్ కూలి 22 మందికి గాయాలు
Also Read
- Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి తెలంగాణ సాయం!
- Drought Affected Mandals: తెలంగాణలో 365 కరవు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం.. మీ మండలం ఈ జాబితాలో ఉందా?
- 6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
- Cyclone Arnab Impact: తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. రాత్రంతా అధికారులకు దిశానిర్దేశం!
కప్పల పెళ్లి అనేది కరువు లాంటి పరిస్థితి నుండి ఉపశమనం పొందడానికి వర్షపు దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి సాంప్రదాయ ఆచారాలతో అడవి కప్పలను వివాహం చేసుకునే పురాతన వేడుక. అక్కడ ఉన్న ప్రజలు ఈ ఆచారం ఖచ్చితంగా పనిచేస్తుందని, ఈ పరిస్థితి నుంచి తమకు ఉపశమనం లభిస్తుందని చెప్పారు. “చెరువులలో నీరు లేదు. పశువులు, మేకలకు ఆహారం లేదు. కరువు లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. గోరేహగి గ్రామంలోని 700 కుటుంబాలు కప్పల పెళ్లిని నిర్వహించాయి,” అని స్థానిక మహిళ చెప్పారు. “గత చాలా రోజులుగా వర్షాలు లేవు, వర్షాలు కురియకపోవడంతో చాలా చెట్లు చనిపోతున్నాయి, వరి పొలాలు ఎండిపోయాయి, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కాబట్టి, గొరహగి గ్రామ ప్రజలు కప్ప నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. విమా పూర్వీకులు సూచించినట్లు మేము సరైన ఆచారాలతో కప్పల వివాహం చేయాలని నిర్ణయించుకున్నాము. గ్రామస్తులందరూ పాల్గొన్నారు. ”అని స్థానిక యువకుడు చెప్పారు.
తాజావార్తలు
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి తెలంగాణ సాయం!
-
Honda CB350C: హోండా CB350C స్పెషల్ ఎడిషన్ లాంచ్.. ఆల్-బ్లాక్ లుక్, 348.36cc ఇంజిన్‌తో కొత్త బైక్!
-
Drought Affected Mandals: తెలంగాణలో 365 కరవు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం.. మీ మండలం ఈ జాబితాలో ఉందా?
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే అంతే సంగతులు!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!