Himanta Sarma Warns Congress MP: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లపై కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్దోలోయ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వార్నింగ్ ఇచ్చారు. అయితే, బీజేపీకి విరాళం ఇచ్చిన సంస్థతో అస్సాం ప్రభుత్వం అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసిందని పేర్కొంటూ నాగోన్ కాంగ్రెస్ ఎంపీ బోర్డోలోయ్ ట్విట్టర్ ( ఎక్స్ )లో పోస్ట్ చేశారు. అయితే, ఎలక్టోరల్ బాండ్లతో బీజేపీ అవినీతి ఏ స్థాయిలో ఉందో చూడండి అంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ను ఆయన జోడించారు. ఇక, దీనిపై అస్సోం సీఎం హిమంత బిస్వా శర్మ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Kothapalli Geetha: కొత్తపల్లి గీతకు కొత్త కష్టాలు.. ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వొద్దు..!
అయితే, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ అవినీతికి పాల్పడిందంటూ సోషల్ మీడియా పోస్ట్‌లపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ హాట్ కామెంట్స్ చేశారు. ఆ పోస్ట్‌లు పెట్టిన కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్దోలోయ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, అవి పూర్తిగా నిరాధారమైనవి అంటూ సీఎం కొట్టి పారేశారు. ఈ సంస్థతో అస్సాం ప్రభుత్వానికి వాణిజ్యపరమైన సంబంధం లేదు.. ప్రగ్జ్యోతిష్‌పూర్ మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పేర్కొన్న ఎంఓయూ దాతృత్వ విరాళం మాత్రమే.. దీని పనులు వేగంగా జరుగుతున్నాయి.. రాబోయే రోజుల్లో ప్రజలకు అంకితం చేయబడతాయని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు.