2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను అస్సాం ప్రభుత్వం సోమవారం 2.9 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను సమర్పించింది. 774.47 కోట్ల లోటును బడ్జెట్ అంచనా వేసింది. ఇందులో కొత్త పన్ను ఏదీ ప్రతిపాదించలేదు.
INDIA bloc: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమిలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ తీరుపై గుర్రుగా ఉంది. బెంగాల్‌లో పొత్తు ఉండదని ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ప్రకటించింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. అస్సాంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం వెళ్లిన ప్రధాని, అక్కడ ర్యాలీలో మాట్లాడారు. స్వాతంత్ర్యానంతరం అధికారంలో ఉన్న వారు ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయారని, తమ సంస్కృతిని, గతాన్ని చూసి సిగ్గు పడ్డారని ఆదివారం అన్నారు. రాజకీయ, సొంత ప్రయోజనాల కోసం తమ స్వంత సంస్కృతి మరియు చరిత్ర గురించి సిగ్గుపడే ధోరణిని ప్రారంభించారని,
Kerala: కేరళలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆకలి బాధతో ఉన్న ఓ వ్యక్తి చనిపోయిన పిల్లిని పచ్చి మాంసం తిన్నాడు. ఈ ఘటనను చూసిన ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దిగ్భ్రాంతికరమైన ఈ ఘటన ఉత్తర కేరళ జిల్లాలోని కుట్టిప్పురంలో జరిగింది. అస్సాంకు చెందిన ఓ వ్యక్తి రోజుల తరబడి ఆహారం లేక పిల్లి పచ్చి మాంసాన్ని తింటూ కనిపించాడు.
Himanta Biswa Sarma: అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా అస్సాం లోకి ప్రవేశించినప్పటి నుంచి ఇద్దరి మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చెలరేగుతూ ఉన్నాయి. ఇటీవల సీఎం హిమంత మాట్లాడుతూ.. యాత్రలో రాహుల్ గాంధీ తన ‘బాడీ డబుల్’ ఉపయోగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అస్సాంలోని గోలక్ గంజ్ నుంచి యాత్ర ప్రారంభించి కొద్ది దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా ధుబ్రి జిల్లాలోని హల్కురా గ్రామంలో ఆగిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ దగ్గరకు చేరుకుని టీ తాగారు.
దక్షిణ మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ సిబ్బంది ఒకరు కాల్పులకు పాల్పడ్డాడు. తన సహచరులపై కాల్పులు జరపగా.. ఆరుగురు గాయపడ్డారు. ఆపై ఆ జవాన్ తనను తాను కాల్చుకున్నాడు. ఈ విషయాన్ని మణిపూర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటన మంగళవారం అర్థరాత్రి సాజిక్ తంపాక్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై మణిపూర్ పోలీసులు విచారణకు ఆదేశించారు. కాల్పులకు పాల్పడిన సైనికుడిది చురాచాంద్‌పుర్ అని గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స కోసం మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం…
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు అస్సాంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రోజు యాత్రలో పాల్గొన్న తమ కార్యకర్తలపై బీజేపీ శ్రేణులు దాడులు చేశాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ రాష్ట్రంలో నాగోన్‌లో రాహుల్ యాత్ర బస్సు ముందు బీజేపీ కార్యకర్తలు ‘‘జైశ్రీరామ్’’ నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీకి మద్దతుగా ‘‘మోడీ..మోడీ’’ అంటూ నినాదాలు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఈ యాత్రలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొ్న్నారు. కాగా.. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు మరోసారి దాడి చేశారంటూ ఆరోపిస్తున్నారు. కాగా.. శనివారం కూడా బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి పాల్పడింది. ఆ దాడిని కాంగ్రెస్ ఖండించింది. అధికార పార్టీ బీజేపీ.. దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి హక్కును 'అణచివేస్తోందని' ఆరోపించింది. రాజ్యాంగాన్ని…
Himanta Biswa Sarma: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ సందర్భంగా అస్సాంలో పర్యటిస్తున్న ఆయన, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ గురించి సంచలన ఆరోపణలు చేశారు. దేశంలోనే అత్యంత అవినీతి సీఎం అని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం ఎదురుదాడి ప్రారంభించారు.