ఆసియా క్రీడలు 2023లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. తాజాగా.. భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మహిళల 45 నుంచి 50 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. దీంతో మరో పతకం ఖాయమైంది. జోర్డాన్ క్రీడాకారిణి హనన్ నాసర్‌తో జరిగిన క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో నిఖత్ జరీన్ ఏకపక్షంగా ఆడింది. ఈ విజయంతో నిఖత్.. 2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్ క్రీడల కోటాను దక్కించుకుంది.
ఆసియా క్రీడల్లో భారత్ మరో బంగారు పతకాన్ని సాధించింది. ఈక్వస్ట్రియన్(గుర్రపు స్వారీ) విభాగంలో బంగారు పతకం సాధించిన భారత్.. 41 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో స్వర్ణం సాధించడం గమనార్హం. 1982 తర్వాత ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారిగా ఈక్వెస్ట్రియన్‌లో బంగారు పతకం సాధించింది.
ఆసియా క్రీడలు 2023లో టెన్నిస్‌లో పతకం సాధించాలన్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి. ఇండియా నంబర్-1 పురుషుల టెన్నిస్ జంట రోహన్ బోపన్న, యుకీ భాంబ్రీలు మొదటి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యారు.
ఆసియా క్రీడలు 2023లో టీమిండియా ఉమెన్స్ క్రికెట్ జట్టు పసిడిని ముద్దాడింది. మహిళల క్రికెట్ ఈవెంట్ స్వర్ణ పతక పోరులో శ్రీలంకపై భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అనంతరం బౌలర్ల అద్భుత ప్రదర్శనతో శ్రీలంకను 20 ఓవర్లలో 97 పరుగులకే పరిమితం చేసి భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టు మయన్మార్ సవాల్‌ను ఎదుర్కొంది. భారత్-మయన్మార్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. అయినప్పటికీ భారత జట్టు ప్రీక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. 13 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో భారత్ ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది.
రేపటి నుంచి చైనాలోని జాంఘులో జరగనున్న 19వ ఆసియా క్రీడల్లో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు అనుమతి చైనా అనుమతి నిరాకరించింది. ఈ చర్యపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని చైనా ఎంబసీ, బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు.
Asian Games: చైనా మరోసారి తన బుద్ధిని చూపించింది. అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన అథ్లెట్లకు వీసాలను, అక్రిడేషన్‌ని నిరాకరించింది. ఉద్దేశపూర్వకంగా భారత క్రీడాకారులను అడ్డుకోవడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా చర్యకు భారత్ శుక్రవారం నిరసన తెలిపింది. ఈ నేపథ్యం కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Indian womens Cricket Team Entered Semi Finals of Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023 సెమీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అడుగుపెట్టింది. గురువారం భారత్-మలేషియా జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో భారత్ సెమీస్ చేరింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో.. ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. అయితే మలేషియా కంటే భారత ర్యాంక్ (టాప్…
ఆసియా క్రీడలకు ముందు భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. డిఫెండింగ్ ఛాంపియన్, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది. తాను ఆసియా గేమ్స్ లో పాల్గొనటం లేదనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.