ఆదివారం జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ విజృంభించింది. ఇవాళ ఒకే రోజు 15 పతకాలు సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో చరిత్రలో తొలిసారిగా భారత ఆటగాళ్లు భారీ రికార్డు సృష్టించారు.
చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది. చైనాతో జరిగిన స్వర్ణ పతక పోరులో భారత్ ఓటమి పాలైంది.
ఆసియా క్రీడల్లో భారత్ పసిడి పంట పండిస్తుంది. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు గోల్డ్ మెడల్స్ చేరాయి. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్, షాట్‌ఫుట్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి.
భారత బాక్సర్ నిఖత్ జరీన్ సెమీ ఫైనల్లో ఓడిపోయింది. బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించాలన్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి. 50 కేజీల విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో నిఖత్ జరీన్ థాయ్‌లాండ్ బాక్సర్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత వెటరన్ నిఖత్ జరీన్ 2-3 తేడాతో ఓటమి పాలైంది.
చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చూపించింది. దక్షిణ కొరియా మహిళల జట్టుతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో.. భారత జట్టు మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించింది. దీంతో భారత మహిళల జట్టు సెమీఫైనల్‌లో చోటు ఖాయం చేసుకుంది.
ఆసియా క్రీడలు 2023లో పాకిస్థాన్‌తో జరిగిన పూల్-ఎ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు చారిత్రాత్మక ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ 10-2 తేడాతో విజయం సాధించింది.
ఆసియా క్రీడల్లో భారత్ మరో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని రికార్డ్ సృష్టించింది. స్క్వాష్‌లో పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందింది. 2014 ఆసియా క్రీడల తర్వాత తొలిసారిగా స్క్వాష్‌లో భారత్ పతకం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన అభయ్‌సింగ్ పాకిస్థాన్‌కు చెందిన జమాన్ నూర్‌పై ఉత్కంఠ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఈసారి టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో రోహన్ బోపన్న, రుతుజా భోసలే జోడీ స్వర్ణం సాధించింది. ఫైనల్లో భారత్ జోడీ 2-6, 6-3, 10-4తో తైపీ జోడీని ఓడించింది.
ఆసియా క్రీడలలో భారత్ జోరు కొనసాగుతుంది. తాజాగా ఇండియా మరో పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల షాట్‌పుట్ ఈవెంట్‌లో కిరణ్ బలియన్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 33వ పతకం.
చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల స్క్వాష్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. 2018 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన స్క్వాష్ జట్టు.. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మలేషియా జట్టును 2-0తో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.