ఆసియా క్రీడలకు సీనియర్ ఆటగాళ్లతో పాటు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానంలో టీమిండియా మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ ఛీప్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. లక్ష్మణ్ ఇప్పటికే ద్రవిడ్ గైర్హజరీలో ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనలకు, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు.
ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. చైనాలో జరగనున్న ఈ గేమ్స్‌లో క్రికెట్‌ను కూడా చూడనున్నారు. ఈ క్రీడల్లో భారత పురుషుల, మహిళల జట్లు పాల్గొంటాయి. ఆసియా క్రీడలకు తమ పురుషుల, మహిళల జట్లను పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి ముందుగా బోర్డు సిద్ధంగా లేకపోయినా ఇప్పుడు అంగీకరించడంతో.. ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ ఆడనుంది. అయితే ఈ గేమ్‌లలో భారత మహిళల జట్టు ఆడనుంది. మరోవైపు ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్‌కు ప్రధాన…